Sri Maisamma Temple | Attapur | Tejaswini Nagar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారు ఇక్కడ గ్రామానికి గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల తేజస్విని నగర్ వద్ద కలదు. శ్రీనికేతన్ స్కూల్ కి ఎదురుగా ఉన్నారు రోడ్ మీదుగా కుడి సైడ్ వెళితే ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. 

ఈ ఆలయంలో మొదట చిన్న ధ్వజ స్తంభం దర్శించుకొని కొంచం లోపలికి వెళ్ళగానే ఆలయం పైన శ్లాబ్ నాగ దేవత రూపంతో చాలా చక్కగా కనిపిస్తుంది. గంట కొట్టి లోపలికి వెళ్ళగానే అమ్మవారి అంతరాయం వరకు వెళ్లవచ్చు. 

ప్రతి సం || ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:00 


#Sri Maisamma Temple  #Attapur  #Tejaswini Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana