Sri Thulja Bhavani Maata Temple | Rambagh Colony | Huda Colony | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ తుల్జా భవాని మాతాగా దేవాలయంలో పూజలు అందుకుంటున్నది. ఈ ఆలయంలో తుల్జా భవాని అమ్మవారు ఆలయం చిన్నగా ఉన్న కూడా ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద ఉన్న రాంబాఘ్ కాలనీ కి మరియు హుడా కాలనీ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే కలదు.
ఈ ఆలయంలో చాలా వరకు ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి తెలుగు భక్తులతో పాటుగా చాలా వరకు ఇక్కడి మరాఠీ భక్తులు రావడం విశేషం. ఈ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజులలో అమ్మవారికి వివిధ రూపాలలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. విజయదశమి రోజున ఇక్కడ ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే ఉంటే దర్శనానికి అనుమతి ఇవ్వబడును. మగవారు పంచ , ధోతి (లేదా) పాంట్ చొక్కా , మహిళలు చీర రవిక (లేదా) చూన్నితో కూడిన పంజాబీ డ్రస్.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Thulja Bhavani Maata Temple #Rambagh Colony #Huda Colony #Attapur #Hyderabad

Comments
Post a Comment