Bramhasutra Omkareshwara Swamy Temple | Beside ORR Road | Manchirevula | Gandipet | Rangareddy | Hyderabad
ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం 1100 సం || కాలంలో కట్టిన దేవాలయం ఈ ఆలయం. ఈ ఆలయం దర్శనం చేసుకుంటే సర్వపాప హరణం ఇక్కడి భక్తుల విశ్వాసం.
1000సార్లు ఒక శివాలయం దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి గొప్ప ఫలితం ఈ ఆలయం ఒక్కసారి దర్శనం చేసుకుంటే లభిస్తుంది అని పెద్దల విశ్వాసం. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం.
ఈ ఆలయం హైదరాబాద్ లోని ఓ ఆర్ ఆర్ రోడ్ పక్కన మంచిరేవుల అనే గ్రామానికి అతి చేరువలో ఈ దేవాలయం కలదు. గూగుల్ మాప్ లో కూడా ఈ ఆలయం ఉన్నది.
ఈ ఆలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున విశేష పూజ జరుగుతుంది. మరియు మహా శివారాత్రి రోజున ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు స్వామి వారికి అభిషేకలు జరుగుతాయి. ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ మహాగణపతి స్వామి ఆలయం, శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ కాలభైరవస్వామి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పంచయతనం, శ్రీ దుర్గా దేవి ఆలయం. వీరభద్రుడు, నాగఫణి దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రావణమాస మహోత్సవాలు నిర్వహింపబడును.
కార్తీక మాసంలో మరియు ఆర్ర్ధ నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు కూడా నిర్వహింపబడును. గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుతారు.
ఆలయ దర్శణా సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 07:15 వరకు
#Bramhasutra Omkareshwara Swamy Temple #Beside ORR Road #Manchirevula #Gandipet #Rangareddy #Hyderabad

Comments
Post a Comment