Sri Shivalayam Temple | Sai Hills Colony | Huda Colony | NM Guda | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఈ దేవాలయం ఒక ఇంటిలో మాదిరిలాగా నిర్మించి ఉంటుంది.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ నుంచి కిషన్ బాఘ్ వెళ్ళే మార్గంలో వచ్చే హుడా కాలనీ నుంచి కుడి వైపు వెళ్ళితే సాయి హీల్స్ కాలనీ వద్ద ఉంటుంది. ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. వీధిలో భారీ వాహనాలు వెళ్లడానికి సౌకర్యంలేదు.
ఈ ఆలయంలో ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున విశేష పూజలు చేస్తారు. సం || లో ఒకసారి వచ్చే మహాశివరాత్రి రోజున ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీ మహాగణపతి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , పక్కనే శ్రీ దుర్గా మాతా అమ్మవారి ఆలయం కూడా ఉన్నది.
శ్రీ మహాగణపతి ఉప ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా శ్రీ హనుమాన్ జయంతి రోజున కూడా చాలా పెద్దగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగ శ్రీ పాండురంగ మహత్యం చాలా బాగా జరుగుతుంది. కేవలం సంప్రదాయం దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును. మగ వారు పంచ, దొతి (లేదా) పాంట్ షర్ట్ మరియు మహిళలు చీర రవిక (లేదా )చూన్నితో ఉన్నటువంటి పంజాభి డ్రస్.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Shivalayam Temple #Sai Hills Colony #Huda Colony #NM Guda #Attapur #Hyderabad

Comments
Post a Comment