Sri Hanuman Shiva Temple | Pochamma Basthi | Masab Tank | Mehindipatnam | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఈ దేవాలయం చిన్నగా ఉన్న కూడా ఈ ఆలయన్ని ఒక్కసారి దర్శిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని మసబ్ టాంక్ వద్ద గల పోచమ్మ బస్తి కి దగ్గర ఉంటుంది. ఈ ఆలయం కొంచం ఇతర మతస్థుల ప్రాంతం లో ఉండడం వల్ల ఈ ఆలయం సరియైన అభివృద్ది జరగలేదు. 

ఈ ఆలయంలో శివాభిషేకం చాలా బాగా చేస్తారు.  ప్రతి సోమవారం మరియు మాస శివరాత్రికి మరియు మహా శివారాత్రి రోజున స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. శివారాత్రి రోజున రాత్రి భజన కార్యక్రమాలు చేసి జాగరణ కూడా చేస్తారు. 

ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రతి శనివారం రోజున స్వామి కి తమల ఆకుల తో ప్రత్యేక అలంకరణ చేసి అర్చనా చేస్తారు. ఈ ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటగా శ్రీ మహాగణపతి విగ్రహం , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి పార్కింగ్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకు గల ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00


  #Sri Hanuman Shiva Temple  #Pochamma Basthi  #Masab Tank  #Mehindipatnam  #Hyderabad                                                          

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana