Sri Lakshmi Narasimha swamy Temple | Tejaswini Nagar Colony | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడం తో చేసి ఉంటుంది. ఈ ఆలయం సుమారు 250 సం || కంటే ముందు నుంచే ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి అతి చేరువలో తేజస్విని నగర్ కాలనీ వద్ద ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది.
ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ మహా గణపతి ఆలయం , నవగ్రహ ఆలయం , హోమ గుండం, గరుడ ఆలయం కలవు. ఈ ఆలయం కొంచం ఇంట్ల మధ్యలో ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహనం మాత్రమే వెళుతుంది.
ఈ దేవాలయంలో ప్రతి సం || స్వాతి నక్షత్రం రోజున స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి ఉత్సవాలు కూడా చేస్తారు. లక్ష్మి నరసింహ స్వామి వారికి ఇక్కడ ఆలయం చిన్నదిగా ఉన్న కూడా చాలా పురాతన ఆలయం కావడం వల్ల స్వామి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. జపం , హోమం చేసేవారు అది గమనిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Lakshmi Narasimha swamy Temple #Tejaswini Nagar Colony #Attapur #Hyderabad

Comments
Post a Comment