Sri Krishan Mandiram | Golkonda rd | Ramsingh Pura | Gudimalkapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం సుమారు 100 సం || ముందు నుంచే ఇక్కడ ఉన్నట్టు సమాచారం. ఈ ఆలయం చాలా పురాతనమైనది కావడం వల్ల భక్తులు ఈ ఆలయాన్ని పునః నిర్మించుకున్నారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని గోల్కొండ రోడ్ వద్ద గల గుడిమల్కాపూర్ రాం సింఘ్ పురా అనే గ్రామం లో కలదు. ఈ దేవాలయం కొంచం చిన్నగా కనిపించిన పార్కింగ్ మాత్రం కొంచం పెద్దగానే ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణా భగవానుడు. ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి తో పాటు శ్రీ ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , పక్కనే గోశాల , దుర్గా దేవి ఆలయం కలదు. ప్రతి సం || దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ప్రతి రోజు గోవు పూజ చేస్తారు.
ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజ చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున కూడా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అందరికీ సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. ఈ దేవాలయం శనివారం మరియు ప్రతి నెలలో వచ్చే కృష్ణా పక్షంలోని ఏకాదశి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం కలదు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30నుంచి 04:00
సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు
#Sri Krishan Mandiram #Golkonda rd #Ramsingh Pura #Gudimalkapur #Hyderabad

Comments
Post a Comment