Sree Vitthal Rukhmini Temple Rd | Shivaji Nagar | Huda Colony | Attapur | Hyderabad

 



ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్తిగా మహారాష్ట్ర లోని శ్రీ విఠ్ఠల మహారాజ్ ఆలయంని పోలి ఉంటుంది. ఈ ఆలయంచిన్నగా ఉన్న కూడా చాలా రద్దీగా ఉంటుంది. ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల శివాజీ నగర్ హుడా కాలనీ కి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం కొంచం చిన్నగా ఉన్న చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణా స్వామి. ఇక్కడ ఉన్న మహారాష్ట్ర భక్తులకి ఈ స్వామి ఆరాధ్య దైవం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ ఉన్న స్వామి రుఖ్మిని తో కలిసి ఉండడం. ఈ ఆలయం లో స్వామి వారి పై కీర్తినాలు చేసిన భకుల మూర్తులను కూడా ఇక్కడ గమనించవచ్చు. 

ఈ ఆలయంలో ప్రతి నెల వచ్చు ఏకాదశి రోజున విశేష పూజలు జరుగుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామి దర్శనం చేసుకొని ఉపవాస వ్రతాన్ని విడిచే వారు ఈ ఆలయంలో చాలా మంది కనిపిస్తారు. 

ప్రతి సం|| వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు , అభిషేకాలు , అర్చనాలు , హోమలు జరుగుతాయి. ఆ రోజున మధ్యాన్నం సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.  

ప్రతి రోజు సాయంత్రం స్వామీకి 07:00 హారతి ఇస్తారు. తప్పకుండ చూడవసిందే.  పాండు రంగా విఠ్ఠల పండరీనాధ విఠ్ఠల అని ఇక్కడ భక్తులు పాడడం గమనించవచ్చు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana