Sri Nalla Pochamma Temple | Satyanarayana Nagar | Ramsighnagar | Karwan | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం సుమారు 40 సం || కంటే ముందు నుంచే ఇక్కడ కలదు. అప్పుడు ఈ అమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉండేధి. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని పెద్దగా పునఃనిర్మించుకున్నారు. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.
ఈ ఆలయం హైదరబాద్ లోని మెహిందిపట్నం కి దగ్గరలో గల కార్వాన్ కి వెళ్ళే దారిలో సత్యానారాయణ నగర్ కి మరియు రామ్సిఘ్ నగర్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం.
ఈ దేవాలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున్న బోనాలు సమర్పిస్తారు. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా వెలిశారు. ఇక్కడ అమ్మవారికి బోనాల పండుగల సమయంలో భక్తులు బోనాలతో పాటు యటాలను సమర్పిస్తారు.
ఆశ్వయుజ మాసంలో ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు. ఇక్కడి గ్రామ ప్రజలు అమ్మవారి pop విగ్రహాన్ని తయారు చేపించుకొని నవరాత్రులు ఉత్సవాలు చేసి 10వ రోజు దసరా నిర్వహించి గంగమ్మ వదిలోకి చేర్చుతారు.
ఆలయ దర్శణా సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Nalla Pochamma Temple #Satyanarayana Nagar #Ramsighnagar #Karwan #Hyderabad

Comments
Post a Comment