Jagadish Mandir | Backside of Croma | Hyderguda | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 250 సం|| కంటే పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా పార్కింగ్ సౌకర్యం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సుమారు 50 ద్విచక్ర వాహనాలు , కార్లు కూడా నిలుపవచ్చు. కేవలం ఒక్క చిన్న రూమ్ అంతా స్థలం లోనే ఈ దేవాలయం ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ మీదుగా హైదర్ గూడ వద్ద గల క్రొమా వెనుకనే ఈ దేవాలయం కలదు. పక్కనే కాలహనుమాన్ మందిర్ పక్కనే ఉంటుంది. అక్కడే పెద్ద గోశాల కూడా ఉన్నది.
ఈ ఆలయంలో ప్రతి సం || ఒరిస్సా లో శ్రీ జగ్గనాథ్ స్వామి కి ఉత్సవాలు జరిపినప్పుడు ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. రధోత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం జరిగే హారతి తప్పకుండ చూడవలసిందే.
ఆలయ దర్శణా సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Jagadish Mandir Backside of Croma #Hyderguda #Attapur #Hyderabad

Comments
Post a Comment