Sri Renuka Yellamma Thalli Temple | Gandhi Nagar Colony | Upperpally | Attapur | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయంలోని ప్రధాన దేవత మూర్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ ఆలయం ఇక్కడి గ్రామానికి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ప్రసిద్ది చెందిన దేవాలయంగా చెప్పవచ్చు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం నుంచి అత్తాపూర్ మీదుగా ఉప్పర్ పల్లి అనే గ్రామం వద్ద గలా గాంధీనగర్ కాలనీ కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలోని అమ్మవారికి ఇక్కడి భక్తులు ఆషాఢ మాసం బోనాలు సమర్పిస్తారు. కేవలం ఈ ఆచారం ఆషాఢ మాసంలోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మరియు ఆదివారం కూడా ఇక్కడ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో ఇక్కడ దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించి 10వ రోజు దసరా పండుగ ఉత్సవాలు జరుపుతారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Renuka Yellamma Thalli Temple #Gandhi Nagar Colony #Upperpally #Attapur #Hyderabad #Telangana

Comments
Post a Comment