Posts

Showing posts from February, 2025

Shivala Ghat Shiva Mandir | Purana pool | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 400 సం || కంటే పురతనమైనది. అంటే చార్మినార్ కంటే కూడా పాతది ఈ శివాలయం. ఈ ఆలయం మనకి చాలా విశేషమైన శివాలయం ఎందుకు అనగా ఈ ఆలయం లో మనకి శివలింగం బ్రహ్మ సూత్రం తో కలిగి ఉంటుంది. అనగా కోటి సార్లు శివాలయం కి వెళితే ఎంత పుణ్యం లాభిస్తుందో అంతడి పుణ్యం ఈ ఆలయం లో ఒక్క సరి వెళితే కలుగుతుంది. మీ అదృష్టం పొందితే కానీ మీరు ఇటువంటి బ్రహ్మ సూత్ర శివలింగం ఆలయంలోనికి ప్రవేశించారు. అంతటి గొప్ప ఆలయం ఈ ఆలయం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని పురాణ పూల్ బ్రిజ్ పక్కనే ఉంటుంది. బయటి నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద ఉంటుంది. ఈ ఆలయం పూర్వం ఒక వ్యక్తి కి తాను ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా ఈ శివా లింగం కనిపించడం వల్ల అక్కడే ప్రతిస్టా చేశారు.  ఈ ఆలయంలో మన చేతులతో మనమే స్వయంగా స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కానీ సోమవారం మరియు మాస శివరాత్రి మరియు ప్రత్యేక రోజులలో మినహాయింపు. ఈ ఆలయం అంతా రాతి తో నిర్మించారు. ఇప్పుడు లోపల కొంచం మార్పులు చేయడం జరిగినది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:0...

Sri Jataagiri Shankara Dasamaiah Shiva Temple | Fatehdarwaza | Doodhbowli | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లోపల కట్టడం గురించి చూస్తేనే మీరే అంటారు ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు అని. చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం మనకి ప్రధాన రహదారి మీదనే నుంచే కనిపిస్తుంది.  ఈ ఆలయం ఫతేదర్వాజ వద్దగల దూద్ బౌలీ హైదరాబాద్ లో కలదు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ చాలా మహిమ గల ఆలయం. ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. వాహనలు వేరే ప్రాంతంలో వదిలి రావడం ఉత్తమం.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ శివయ్య తండ్రి. మనకి ప్రారంభంలోనే శ్రీ గణపతి స్వామిని దర్శించుకోవాలి. తరువాత ఇక్కడ ఆలయ రక్షకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి ఉండడం విశేషం. ఈ ఆలయంలో స్వామిని శ్రీ జఠగిరి శంకరదాసమయ్య దేవాలయం గా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ప్రతి సోమవారం మరియు మాస శివరాత్రి రోజు అధిక రద్దీ కలదు. శివరాత్రి రోజు ఐతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా సోమవారం మినహా మిగిలిన రోజులలో స్వామికి మన చేతులతో స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయం వారు కలిపించారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ సాయంత్రం : 05:00 నుంచి 0...

Shri Somanath Temple | Dhobi Ghat | Talabkatta | Yakutpura | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు  500 సం || క్రితమే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని ధోబి ఘాట్ వద్ద గల అమన్ నగర్ , భవానీ నగర్ మధ్యలో యకత్ పుర్ అనే గ్రామంలో కలదు. ఇది అంతా ముస్లిం ఆక్రమిత ఓల్డ్ సిటీ లో కలదు. ఈ ఆలయం లోని శివ లింగం స్వయంభూ శివలింగం. చాలా పాతా ఆలయం ఐనప్పటికి శిల్ప కల ఆలయం ఏ మాత్రం చెక్కు చెదరలేదు.    ఈ ఆలయం లో మనకి చాలా విశేషాలు కనిపిస్తాయి.  ఇక్కడ చాలా పెద్ద మరియు చాలా లోతైన నీటి భావి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 8 వ శతాబ్దం నుంచి ఒక్కటే కుటుంబం వారు పరిరక్షితున్నారు. ఈ ఆలయం లో చాలా పెద్ద స్వయంభూ శివలింగం ని దర్శించవచ్చు. ఇక్కడ ఆలయంలో భావి లోని నీరు ఎప్పుడు ఒక్కటే విధంగా ఉంటాయి.  ఇక్కడ ఒక పెద్ద చెట్టు లో నుంచి వచ్చిన శివలింగ గమనించవచ్చు. మరియు ఆది కూడా రాతితో ఉన్న నంది మీద ఉంటుంది. ఇక్కడ స్వయంభూ శివలింగం తో పాటుగా మనకి గణపతి , దుర్గాదేవి , సంతోషిమాతా కూడా దర్శనం ఇస్తారు. శివరాత్రి రోజు రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు స్వామీ వారికి కళ్యాణం కూడా చేస్తారు. ప్రతి సోమవారం , మాస శివరాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శనం సమయ...

Sphatik Mahadev Shiva Mandir | Beside Charminar | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఇక్కడికి వచ్చిన కూడా చాలా మంది అంతా గమనించకుండానే వెళ్లిపోతారు. మీ జాతకం ఎంత నీచ స్థితిలో ఉన్న కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఒక్క సరి మనస్సు పూర్తిగా కొలిస్తే స్వామి వారికి ఏదో ఒక దారి చూపిస్తారు అని భక్తుల నమ్మకం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవి ఆలయం వెనుక అనగా చార్మినార్ నుంచి అఫ్జల్ గంజ్ కి వెళ్ళే మార్గంలో ఎడమ వైపు ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పాల రాతి తో నిర్మించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఈ ఆలయంలో స్వామి మొట్ట మొదట మొత్తం దక్షిణ భారతదేశంలో మొదటి స్పటిక శివ లింగం అని పేరు ఉన్నది.  ఈ ఆలయంలో 1857 సం || లో నిర్మించారు. అప్పుడు చాలా పాతగా ఉండడం వల్ల కొన్ని సం || అనగ 15 సం || క్రితమే పునః నిర్మాణం చేపించారు. ఈ ఆలయంలో మనకి మొదట వెళ్ళగానే 31 తల లతో శివయ్య దర్శనం ఇస్తారు. ఆ పక్కనే స్పటిక శివ లింగం కలదు. వెనుక గణపతి కూడా ఉంటారు.  ఈ ఆలయంలో మనకి శివలింగం తో పాటుగా శ్రీ లక్ష్మీ నారాయణులు , సంతోషిమాతా , దుర్గా దేవి , శ్రీ ఆంజనేయ స్వామి , సాయి బాబా తో పాటుగా నవగ్రహాలు కూడా దర్శ...

Swayambhu Patala Hanuman Temple | Bahadurpura | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. దాదాపు ఈ ఆలయం 700 సం || నుంచి ఉన్నట్టుగా ఇక్కడి పూర్వీకులు , స్థానికులు చెప్పడం జరిగినది. పక్కన శ్రీ రామాలయం , కుడి వైపున పుట్టలో అమ్మవారు కలరు.  ఈ దేవాలయంలో స్వామి వారి విగ్రహం యొక్క దేహం తూర్పు దిక్కుకు చూస్తూ ముఖం ఉత్తర దిక్కును చూస్తూ ఉన్నట్టు గా గమనించవచ్చు. ఇలా మనకు ఎక్కడ కనిపించకపోవడం విశేషం. ఇది ఎవరు ఎప్పుడు ప్రతిష్టించారో ఎంత ప్రయత్నించిన తెలియని విషయం.  ఈ స్వామి స్వయంభూ హనుమాన్ విగ్రహం వెనుక ఉన్న బావి నుంచి 150 అడుగుల భూగర్భం నుంచి బయటికి తీసి పూజలు చేశారు కావున ఈ హనుమాన్ స్వామి కి స్వయంభూ పాతాళ హనుమాన్ అనే పేరు వచ్చినది. అందుకే దీనిని మహిమా గల స్వామి అని భక్తుల విశ్వాసం.  ఈ ఆలయం లో కోరిన కోరికలు నేరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇంతటి మహిమ గలిగిన శ్రీ ఆంజనేయ స్వామి నల్లని కాంతి కలిగిన విగ్రహ దర్శనం చూడడం అదృష్టం అని చెప్పవచ్చు. ఈ ఆలయం వెనుక శ్రీ పుట్ట కూడా ఉన్నది పక్కనే శ్రీ ఎల్లమ్మా అమ్మవారు కూడా ఉన్నారు. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న కూడా చాలా మహిమ గల ఆలయం. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. మరియు ఆలయం చిన్నగా ఉంటుంది. ఈ హ...

Sri Ramalingeshwara Swamy Temple | Damagundam | Puduru | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ కి సుమారు 70 కి. మీ దూరంలో పూడూరు గ్రామానికి కేవలం 4 కి . మీ దూరంలో కలదు. ప్రస్తుతం ఈ ఆలయం కాలక్రమంలో పరిగి వెళ్ళే మార్గంలో ఉన్నది అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఇక్కడ శ్రీ మహావిష్ణువు శివునికి ప్రధమ భక్తుడిగా ఉంటారు. ఈ ఆలయ మహత్యాన్ని స్కంద పురాణంలో కూడా తెలుపడం జరిగినది.  ఈ ఆలయం చుట్టూ నీరు మధ్యలో శివాలయం ఉంటుంది. ఇక్కడ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి లో స్నానం ఆచరిస్తే రోగాలు నయం అవుతాయి అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని ఇక్కడి శాసనాల ద్వారా తెల్సుకోవచ్చు. పూర్వం శ్రీ రాముల వారు కోటి లింగాలు ప్రతిష్ట చేశారు అని అందులో ఈ లింగం కూడ ఉన్నది అని చరిత్ర చెపుతుంది. మరియు మారియొక్క కథ కూడా ప్రాచుర్యంలో కలదు. పూర్వం ఇద్దరు వ్యక్తులు తమ పొలం లో నాగలి తో పొలం దున్నుతు ఉండగా ఆ నాగలి కి తగిలి స్వామి వారు ఆ ఇద్దరి యాక్టులకి కలలో కనిపించి తారు ఎక్కడ ఐతే దర్శనం ఇస్తానో అక్కడే ప్రతిష్ట చేయాలి అని చెప్పగా వారు అలానే చేశారు వారు పేరు మీదనే దాము గుండం పేరునే దాము గూడెం అనే పేరు వచ్చినది.  ఈ ఆలయం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుం...

Sri Mahankali Temple | Alwal | Secunderabad | Siddipet road | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయ ఎంట్రన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. పాత రకమైన ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఈ దేవాలయం సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట కి వెళ్ళే మార్గం మధ్యలో ఉంటుంది. సరిగ్గా తిరుమలగిరి పాత పోలీస్ స్టేషన్  ఆల్వాల్ కి మధ్యలో వస్తుంది.  ఈ ఆలయంలో అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి సం || ఆషాడ మాసంలో భారీ ఎత్తున భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆలయ కూడా చాలా పెద్దగా ఉంటుంది. విశాలమైన కార్ మరియు ద్విచక్ర వాహనం మరియు బస్ లు కూడా అపగలిగినంత పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ప్రతి సం || బోనాల పండుగ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దేవి నవరాత్రి 9 రోజులు ఈ ఆలయం లో చాలా రద్దీ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన , అమ్మవారికి అభిషేకం , హోమం చాలా బాగా చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:45  #Sri Mahankali Temple  #Alwal #Secunderabad  #Siddipet road  #Hindu Temples Guide 

Sri Vijaya Ganapathi Temple | Sun City | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చేవేళ్ళ రోడ్డు మీదుగా ఉంటుంది. కానీ మనం ఈ ఆలయానికి చాలా త్వరగానే చేరుకోవచ్చు. ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందిపట్నం నుంచి చిలకూరు బాలాజీ కి వెళ్ళే బస్ ఈ ఆలయం ముందు నుంచే వెళుతుంది. మనం హైదర్శ కోట్ అనే చెప్పితే ఇక్కడ దింపుతారు. బస్ స్టాండ్ నుంచి కేవలం 5 నిమిషాలు నడిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి కార్ మరియు ఇతర పెద్ద వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. ద్వి చక్ర వాహనాలు కూడా బయట పార్కింగ్ చేయాలి.  ఈ ఆలయం లోపల చాలా బాగా ఉంటుంది. ఏ ఇతర ఆలయం లో లేని ప్రత్యేకత ఈ ఆలయంలో కలదు. ఈ ఆలయంలో గణపతి , సుబ్రమణ్య స్వామి , అయ్యప్ప స్వామి శివాయ తండ్రి , శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి పక్క పక్కనే కనిపిస్తారు. ఈ ఆలయంలో గణపతి స్వామి విశేష గరిక పూజ చేస్తారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కి పూజలు చేస్తారు. అయ్యప్ప స్వామి కి  కూడా విశేష పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం శివయ్య తండ్రికి అభిషేకం మరియు శివరాత్రికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం లోపల నవగ్రహ మండపం , గోశాల కూడా ఉన్నాయి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచ...

Sri Rathike Hanuman Temple and Math | MG Road | Tank Band | Secunderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లో హనుమాన్ ఆలయాలలో పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా పాత ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని టాంక్ బాండ్ వద్ద నుంచి కొంచం ముందుకు వెళ్ళగానే ఏడమ వైపు ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. ఫోర్ వెహేలర్ మాత్రమే కాదు ద్వి చక్ర వాహనం కూడా ఆపడానికి సరియైన సౌకర్యం లేదు. అంటే ఈ రోజులలోనే ఈ ఆలయం నిర్మించారు అని అర్ధం చేసుకోయవచ్చు.  ఈ ఆలయంలో శ్రీ రామ నవమి , దసరా , దీపావళి పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రారంభం నుంచే మనకి శ్రీ రామాయణం లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని కళ్ళకి కట్టినటు ఇక్కడి పెయింటింగ్ మనతో మాట్లాడుతాయి. పూర్వం ఈ ఆలయం ఇక్కడి నుంచి జరిపించాలి అని చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఏనో దాడుల నుంచి ఈ ఆలయాన్ని రక్షించుకున్నాం.  ఈ ఆలయం ఇప్పుడు శిలా వస్థకి చేరుకున్నది. స్వామి వారికి మధ్యాన్నం హారతి మరియు సాయంత్ర హారతి చాలా బాగా ఇస్తారు. ఇక్కడ చాలా మంది హనుమాన్ చాలీసా చదువుతారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00   

Sri Sai Baba Temple | Attapur | Hyderguda | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇప్పడు ఈ ఆలయాన్ని పునః నిర్మించారు. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మార్పులు చేశారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందిపట్నం కి 7 కి. మీ దూరంలో ఉన్న అత్తాపూర్ గ్రామం లో PVNR Expressway పిల్లర్ నంబర్ 125 ఎదురుగా కొద్దిగా లోపలికి ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ శిరిడీ సాయి బాబా. ప్రతి గురువారం రోజు మధ్యాన్నం సమయంలో అన్నదాన ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఆలయం లోపలికి ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం లో ఉంటుంది. కానీ సరియైన కార్ పార్కింగ్ లేదు. ఈ ఆలయంలో శ్రీ సాయి బాబా తో పాటుగా శ్రీ శివయ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు.  ఈ ఆలయంలో గురుపూర్ణిమ , శ్రీ రామ నవమి , దసరా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దేవి నవరాత్రి సమయంలో ప్రతి రోజు చండీ హోమం కూడా నిర్వహిస్తారు. శివరాత్రి రోజు కూడా రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 నుంచి 05:45 బ్రేక్  సాయంత్రం : 06:00 నుంచి 08:00  #Sri Sai Baba Temple #Attapur #Hyderguda #Hyderabad #Hindu Temples Guide   

Sri Surya Bhagavan Temple | Hyderguda | Attapur | Hyderabad | Hindu Temples Guide

Image
   మనకి శ్రీ సూర్య భగవణుని ఆలయాలు కనిపించడం చాలా అరుదు. ఒకటి ఆంధ్ర లో ఉంటే ఇంకోటి మన తెలంగాణలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. పైన ఫోటోలో చూస్తేనే మీకు అర్ధం అవుతుంది. మొత్తం రాతితో నిర్మించిన ఆలయం ఈ సూర్య దేవునియ ఆలయం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల హైదర్ గూడ కి కొద్ది దూరంలో శ్రీ విధ్యానికేతన్ అనే స్కూల్ కి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రశాంతమైనా వాతావరణంలో ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ లో కూడా ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో మనకి ఇతర దేవత మూర్తులని కూడా దర్శించుకోవచ్చు.  ఈ ఆలయంలో ప్రధానంగా సప్త గుర్రాలతో శ్రీ సూర్య భగవానుడు , ఛాయా దేవి , శ్రీ దుర్గా దేవి , శ్రీ మహాలక్ష్మీ దేవి కూడా దర్శించవచ్చు. బయట కొద్ది దూరంలోనే శివాలయం కూడా దర్శించవచ్చు. రావి చెట్టు కింద శ్రీ నాగదేవత విగ్రహాలు కూడా దర్శించవచ్చు.   ఆలయం అవరంలోనే ప్రక్కనే శ్రీ సూర్య దేవాలయ గోశాల కూడ ఉన్నది. స్వామి వారికి మరియు శివయ్య కి ఆవు పాలతో అభిషేకం చేస్తారు. మనం కూడా అభిషేకం చేయవచ్చు. బయట హోమ గుండం కూడా ఉన్నది. ఇక్కడ హోమలు కూడా చేస్తారు. ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:00...

Sri Gandimaisamma Temple | Gandipet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం హైదరాబాద్ లోని గండిపేట వద్ద కలదు. ఈ ఆలయం లోపలికి వెళ్ళలీ అంటే ఒక పైప్ లైన్ చిన్న స్వరంగా మార్గం నుంచి ఆలయం లోపలికి వెళ్ళాలి. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి కేవలం 20 కి,మీ దూరంలో కలదు. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఉంటుంది. చాలా చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ గండిమైసమ్మ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అత్యంత శక్తివంతమైయాన అమ్మవారు. ఇక్కడ అమ్మవారు బోనాల పండుగ మరియు దసరా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఈ ఆలయం వెనుక పెద్ద గండిపేట చెరువు ఉన్నది. పూర్వం మరియు ఇప్పడు కూడా హైదరాబాద్ కి తాగు నీరు ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. పూర్వం హైదరాబాద్ పరిపాలించిన రాజులు కూడా ఇక్కడ అమ్మవారికి పూజ చేసే వారు అని ఇక్కడి అర్చకులు చెప్పేవారు.  ఈ ఆలయానికి ఈ పేరు రావడానికి ఇక్కడ అమ్మవారు గండాల నుంచి రక్షణగా ఉండడం వల్ల ఇక్కడ అమ్మవారికి ఈ పేరు వచ్చినది. ఆలయ ప్రారంభంలోనే రాతి తో నిర్మించిన చిన్న ధ్వజ స్తంభం కలదు.  ఇక్కడి అమ్మవారికి నాన్ వెజ్ నైవేద్యం సమర్పిస్తారు.  ఆలయ దర్శనం సమయం : ఉదయం : 06:00 నుంచి సాయంత...

Sri Shiva Anjaneya Swamy Temple | Upperpally | Hyderguda | Attapur | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి 3 దశాబ్దాలు పైనే ఐనది. ఈ ఆలయం హైదరాబాద్ చివరన ఉన్న అత్తాపూర్ , హైదర్ గూడ కి చివరన ఉప్పర్ పల్లి వద్ద కలదు. కోటి నుంచి ఈ ఆలయానికి 94 u అనే బస్ డైరెక్ట్ గా ఈ ఆలయం ఎదురుగు అగుతుంది. ఈ ఆలయం పార్కింగ్ కొంచం చిన్నగా ఉంటుంది. ఆలయ ప్రారంభంలోనే మనకి రాతి తో చెక్కబడిన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. పైన ఫోటోలో కూడా గమనించవచ్చు.  ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ శివయ్య స్వామి. ఇక్కడ ప్రతి సం || శివయ్యకి శివరాత్రి రోజు చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివయ్య తో పాటుగా మనకి మొదట శ్రీ గణపతి స్వామి ని దర్శించుకోవచ్చు. స్వామి దర్శనం తరువాత శివయ్య దర్శనం చేసుకోవాలి. తరువాత నవగ్రహ మండపం కూడా కలదు. తరువాత శ్రీ దుర్గా దేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. తరువాత శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీ రామ నవమి , చాలా బాగా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:30 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 నుంచి 04:45 బ్రేక్  సాయంత్రం : 04:45 నుంచి 07:45    #Sri ...

Sri Dhana Laxmi Temple | Ammerpet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ లోని అమీర్ పేట x రోడ్డు మీద ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. ద్విచక్ర వాహనం కి కూడా పార్కింగ్ లేదు.  ఈ ఆలయం లో ప్రధాన దేవత శ్రీ ధనలక్ష్మీ దేవి. ఇక్కడ అమ్మవారి చాలా సం || క్రితం నుంచే వెలిశారు. ఈ ఆలయంలో మొదట మనకి శ్రీ విజ్ఞ వినాయకుడు దర్శనం ఇస్తారు.  పక్కనే దుర్గా దేవి దర్శనం ఇస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం ప్రారంభం అవుతుంది. ఇక్కడ అమ్మవారికి చూడడానికి రెండు కన్నులు సరిపోవు. ఇక్కడ ధనలక్ష్మీ అమ్మవారిని అంత అందంగా అలంకరణ చేస్తారు. ప్రతి సం ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దేవి నవరాత్రి లలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. దీపావళి రోజు ఈ ఆలయం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 నుంచి 04:45 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Dhana Laxmi Temple  #Ammerpet  #Hyderabad  #Hindu Temples Guide 

Sri Venkateswara Swamy Temple | KPHB Phase 3 | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 32 సం || అవుతుంది. ఈ ఆలయం హైదరాబాద్ లోని ప్రధాన నగరం కుకెట్ పల్లి , హౌసింగ్ బోర్డు 3వ ఫేజ్ వద్ద బస్ స్టాప్ కి కొద్ది దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లోపల చాలా పెద్దగా ఉంది. కానీ సరియైన కార్ పార్కింగ్ సౌకర్యం అంతగా లేదు. చాలా చిన్నగా ఉంటుంది పార్కింగ్ స్థలము.  ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధాన దేవత మూర్తి. మనం ఆలయ గెట్ దాటి లోపలికి వెళ్ళగానే మొట్ట మొదట విజ్ఞ వినాయకుడు దర్శనం ఇస్తారు. అట్టు పక్కనే శ్రీ రామ భక్తుడు ఐనటు వంటి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. తరువాత కొన్ని మెట్లు ఎక్కిన తరువాత జగత్ గురువు శ్రీ ఆది శంకరాచార్య స్వామి దర్శనం చేసుకోవాలి. తరువాత ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే ఇక్కడే కలియుగ ప్రత్యక్ష రూపం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపం దర్శనం ఇస్తారు.  ఇక్కడ మనకి రెండు పక్కల శ్రీ దేవి , భూదేవి , స్వామి వారి అంతరాలయం లో శ్రీ పద్మావతి అమ్మవారు కనిపిస్తారు. ఆలయం వెనుక శ్రీ ఆండాళ్ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే పెద్ద హాల్ కూడా ఉన్నది. శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , దసరా , దీపావళి మరియు ఇతర ప్రధాన రోజుల...

Sri Gutta Pochamma Temple | Shaikpet | Hyderabad | Hindu Temples Guide

Image
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ. ఇక్కడ అమ్మవారు ఒక గుట్ట లో వెలిసి ఉన్నారు. ఆ గుట్టకే అమ్మవారు అనుకోని ఉండడం స్వయంగా చూడవచ్చు. ఈ ఆలయం హైదరాబాద్ లోని షేక్పేట వద్ద గలదు. ఇక్కడ కి కొద్ది దూరంలో వరకు మాత్రమే బస్ ల సౌకర్యం కలదు. ఆలయం ఎదురుగా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు.  ఒక్కటే సరి 100 టూ విహీలర్ మరియు 50 ఫోర్ విహీలర్ బండ్లు వచ్చిన కూడా పార్కింగ్ చేయవచ్చు.  ఇక్కడ అమ్మవారి ఆలయం ప్రారంభం లోనే పెద్ద రాజా గోపురం ని దర్శనం చేసుకోవచ్చు. అది దాటుకొని లోనికి ప్రవేశించగానే రాతి తో నిర్మించిన ఆలయ యొక్క ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచం ముందుకు ప్రవేశించగానే అమ్మవారి దివ్యమైన పాదాలు దర్శించుకోవచ్చు. ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం లోనికి ప్రవేశిస్తాము. లోపల ప్రశాంతమైన వాతావరణం , రంగు రంగుల చిత్రల పిల్లర్లు పెద్ద ఆలయం ప్రాంతం కనిపిస్తుంది.  ఇక్కడి నుంచి అమ్మవారి ఆలయం ఎదురుగా చూడగానే అమ్మవారు ఇక్కడ చాలా మందికి బాల రూపంలో కనిపిస్తుంది. ఆలయం ప్రదక్షిణ చేసి లోపలికి వెళుతూ ఉండగానే ఆలయం చుట్టూ పరివార దేవతలు దర్శించవచ్చు. ఇక్కడే సరిగ్గా ఆలయం వెనుక గుట్టకే చిన్న రంధ్రం ఉంది అ...

Sri Abhaya Anjaneya Swami Temple | Jagadirgutta | Kuketpally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. పైన ఫోటో లో చూపించిన విధంగా ఆలయం ముందే పార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆలయం హైదరాబాద్ లోని కుకెట్ పల్లి మరియు జగ్గదిర్ గుట్ట కి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీదనే ఉండడం వల్ల విపరీతమైన సౌండ్ వస్తుంది.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ పక్కనే శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి ఆలయం కూడా ఉన్నది. శ్రీ రామ నవమి , దసరా , దీపావళి రోజున ఈ ఆలయం లో చాలా రద్దీ గా ఉంటుంది.  ఈ ఆలయం ప్రక్కనే శివాలయం కూడా ఉన్నది. ప్రతి సం || శివరాత్రి రోజున స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు , బిలవార్చన , హోమం కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ నవమి రోజున స్వామి వారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు.   ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:30 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Abhaya Anjaneya Swami Temple  #Jagadirgutta #Kuketpally #Hyderabad #Hindu Temples Guide

Sri Naga Sai Mandir | Shiridi Hills | Jagadir gutta | kuketpally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని చూడాలి అంటే కొండ మీద వరకు వెళ్ళాలి. ఈ ఆలయం హైదరాబాద్ లోని కుక్కేట్ పల్లి వద్ద గల జగ్గదిర్ గుట్ట వద్ద గల శిరిడీ హీల్స్ వద్ద ఈ ఆలయన్ని చూడవచ్చు.  ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి ధ్యాన ముద్రలో శివయ్య ని చూడవచ్చు. ప్రారంభం నుంచే చక్కటి పెయింటింగ్ తో చూపు అక్కడే నిలబడిపోయేటట్టు ఉంటాయి. సరస్వతి దేవి , లక్ష్మీ దేవి , ద్వాదశ జ్యోతిర్లింగాలు , కంచి కామాక్షి దేవి , ఇతర పెయింటింగ్ లు చూపులని ఇట్టే ఆకట్టుకుంటాయి. తరువాత గణపతి ఆలయం , హోమగుండం కనిపిస్తుంది.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఆలయం లోపల మనకి గోశాల కనిపిస్తుంది. అక్కడే చిన్నటి రాధాకృష్ణుడి విగ్రహం తో చూడవచ్చు. తరువాత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , ఒక రావి చెట్టు కింద అష్ట లక్ష్మీ దేవుల విగ్రహాలు మరియు నాగదేవత విగ్రహాలు చూడవచ్చు. తరువాత కొంచం ముందుకు వెళితే చక్కటి శివ లింగం కనిపిస్తుంది.  తరువాత శ్రీ దుర్గా దేవి ఆలయన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతి సం || దసరా భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మ వారికి కూరగాయాలతో అలంకారం ప్రత్యేక ఆకర్షణ. తరువాత పెద్ద శివ లింగం గోపురంతో నిర్మించి అందులో సాయి బ...

Sri Bangaru Gavvala Renuka Yellamaa Temple | Vinayaka Nagar Colony | Satya Nagar | Kothapet | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా మహిమ గల ఆలయం. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు. తెలంగాణ సంప్రదాయంలో ఈ అమ్మవారిని చాలా ఎక్కువగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారిని కొందరు వారి ఇంటి ఆడపడుచుగా కూడా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు పేరు శ్రీ బంగారు గవ్వల రేణుక ఎల్లమ్మ అమ్మవారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని కొత్తపేట వద్ద గల వినాయక నగర్ కాలనీ , సత్యనాగర్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఆలయం కొంచం చిన్నగానే ఉంటుంది. కానీ చాలా మహిమ గల అమ్మవారు.  ఇక్కడ ప్రతి సం || ఆషాడ మాసంలో భారీ ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మరియు దసరా నవరాత్రిలో చాలా ఘనంగా పూజలు నిర్వహిసారు. అప్పుడు అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక అభిషేకాలు , ప్రత్యేక హోమలు కూడా నిర్వహిషారు. మంగళవారం మరియు శుక్రవారం కొంచం రద్దీగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:30 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:30 బ్రేక్  సాయంత్రం : 05:30 నుంచి 07:45 వరకు  #Sri Bangaru Gavvala Renuka Yellamaa Temple #Vinayaka nagar colony #Satyanagar #Kothapet #Hyderabad #Hindu Temples Guide  

Sri Hanuman Temple | Aramghar | Shivarampally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 35 సం || క్రితమే నిర్మించారు. ఇక్కడ ప్రతి సం || హనుమాన్ జయంతి , శ్రీ రామ నవమి , రోజు చాలా రద్దీ గా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రత్యేక రోజులలో అన్నదానం కూడా నిర్వహిస్తారు.  ఈ ఆలయం అరమఘర్ , శివరాం పల్లి కి మధ్య లో ఉంటుంది. సరిగ్గా pvnr express way బ్రిడ్జ్ కి ఎడమ వైపు కిందకి దిగే బ్రిడ్జ్ కి పక్కనే ఉంటుంది. పూర్వం ఇక్కడ అంతగా అభివృద్ది చెందని సమయంలోనే ఇక్కడ ఆలయం ఉంటుండే. కాలక్రమంలో ఈ ప్రాంతం అభివృద్ది చెందే సమయంలో కొందరి దుర్మార్గుల చెడ్డ ఆశల వల కొంత ప్రాంతం కబ్జా కి గురి ఐనది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 05:30 బ్రేక్  సాయంత్రం : 05:30 నుంచి 07:00  ప్రతి మంగళవారం మరియు శనివారం రద్దీ అధికంగా ఉంటుంది. ప్రత్యేక అభిషేకం మరియు అర్చన కోసం ప్రత్యేక టిక్కెట్లు అంటూ ఇక్కడ ఏమి ఉండవు. అంతా ఆలయ పూజారి గారి చేతుకొనే ఉంటుంది.    #Sri Hanuman Temple #Aramghar #Shivarampally #Hyderabad  #Hindu Temples Guide 

Sri Laxmi Venkateshwara Swami Temple | Jagadirgutta | Kuketpally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా మహిమ గల ఆలయం. ఇక్కడ స్వామి చాలా పెద్ద కొండ మీద వెలిశారు. ఇక్కడ స్వామి లక్ష్మీ సహేతుడై కొలువై ఉన్నారు. ఈ కొండ మీద నుంచి చూస్తే హైదరాబాద్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఆలయం హైదరబాద్ లోని కుకెట్పల్లి వద్ద గల జగ్గదిర్ గుట్ట మీద ఈ ఆలయం కలదు. జగ్గదిర్ గుట్ట వరకు బస్ లు కలవు. ఈ బస్ స్టాప్ నుంచి ఆలయం కేవలం 1.5 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఆటో లు కూడా వెలుతాయి.  ఈ ఆలయం దేవాదాయ ధర్మదాయ వారి ఆధీనంలో ఈ ఆలయం ఉన్నది. ప్రతి సం || ఫెబ్రవరి నెల లో 3 రోజుల పాటు స్వామి వారికి ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఇక్కడ చాలా ఎత్తైన కొండ మీద ఉండడం వల్ల పార్కింగ్ కింద నే చేసుకోవాలి. జాతర సమయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది.  ప్రత్యేక పూజలు కొరకు టికెట్ తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున , దసరా , దీపావళి రోజున రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Laxmi Venkateshwara Swami Temple #Jagadirgutta #Kuketpally #Hyderabad #Hindu Templ...

Sri Kodanda Rama Swamy Temple | Gowlipura | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. హైదరాబాద్ లోని గౌలిపురా లో 18 వ వీధిలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం కొద్దిగా లోపలికి ఉంటుంది. కానీ చాలా పురాతన ఆలయం. మీరు లోపలికి వెళ్ళే ముందే ఆలయం ప్రహరీ గోడ యొక్క ప్రధాన ద్వారం చూస్తేనే తెలుస్తుంది. చాలా పెద్ద ద్వారం కలదు.  ఈ ఆలయం ప్రధాన ద్వారం దాటుకొని ముందుకు వెలగానే మొదట మనకి 25 అడుగుల ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అది కూడా దాటుకొని వెల్లగానే మారియొక్క గోపురం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రధాన ఆలయం లోనికి వెలుతాము. ఇక్కడ శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి ప్రధాన దేవత మూర్తులు కనిపిస్తాయి. ఇక్కడ ఆలయ సంరక్షకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు.  ఇక్కడ ప్రతి సం || శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , దసరా , దీపావళి మరియు ఇతర పండుగల సమయంలలో రద్దీ చాలా ఎక్కువగ ఉంటుంది. ఈ ప్రాంతం కొంచం సున్నితమైన ప్రాంతం. ఇతర మతస్థుల ప్రాబల్యం ఎక్కువగ ఉన్న కూడా మొదటి నుంచి ఇక్కడ ఆలయం ఉండడం అంతటి పురాతన ఆలయం రక్షించుకొడవం మన అందరి బాధ్యత.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:45 నుంచి 10:45  మధ్యాన్నం : 11:30 నుంచి 04:45 బ్రేక్  సాయంత్రం : 04:45 నుంచి 08:00 వరకు  #Sri Kodanda Rama...

Sri Lakshmi Narasimha Swamy Temple | Peerzadiguda | Parvathapuram | Hyderabad | Hindu Temples guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని ఉప్పల్ కి 8కి.మీ దూరంలో కలదు. ఈ దేవాలయం బయటి నుంచి చూడడానికి చిన్నగా ఉన్న లోపల కొంచం పెద్దగానే ఉంటుంది.  పూర్వం ఇక్కడ యాదమ్మ అనే భక్తురాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కోసం యదగిరి గుట్ట లో స్వామి కొలుస్తూ ఉండగా ఒక రోజు స్వామి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని కోరగా తాను స్థలాలను వెతకడం ప్రారంభించినది. ఆమెకి నచ్చిన ప్రాంతంలో ఒక పెద్ద నాగదేవత పుట్ట ఉన్నది. ఇప్పటికి అందులో పాలు సమర్పిస్తారు.  ఈ పుట్ట నుంచి కొద్ది అడుగుల దూరంలోనే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శనం ఇస్తుంది. స్వామి సుమారు 6 అడుగుల ఎత్తులో చక్కటి విగ్రహంతో స్వామి అమ్మవారితో కనిపిస్తారు.  ఇక్కడ స్వామి తో పాటుగా ఉప ఆలయాలు కలవు. అందులో శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి దేవాలయాలు కలవు. ఇక్కడ చక్కటి యగశాల కూడా ఉన్నది. ప్రతి సం || వైకుంఠ ఏకాదశి రోజున మరియు దీపావళి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ సాయంత్...

Sri Sri Radha Gopinath Mandir | Regimental Bazaar | Secunderabad | Telangana | Hindu temples guide

Image
  ఈ ఆలయం సికింద్రాబాద్‌లోని శివాజీనగర్‌లోని రెజిమెంటల్ బజార్ వద్ద సంగీత్ క్రాస్‌రోడ్స్ వద్ద సెయింట్ జాన్స్ రోడ్‌లో ఉంది, ఈ ఆలయాన్ని 1960 వ సం || లో చాలా చిన్న దేవలయంగా ఉంటుండే. అంచెలు అంచలుగా దిన దినాభివృద్ది చెందడం ఇక్కడ విశేషం. ఈ ఆలయం సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఉంది. ఇది సికింద్రాబాద్ స్టేషన్ నుండి నడవవచ్చు. మీరు మెట్రోలో వస్తుంటే సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్‌లో దిగవచ్చు. ఇక్కడ ప్రైవేట్ ఆటోలు  అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడిని చూడడానికి రెండు కన్నులు సరిపోవు. చాలా అందంగా ఉంటాడు ఇక్కడ శ్రీ కృష్ణుడు ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు మరియు గోకులాష్టమి , మరియు దీపావళి రోజు ఈ ఆలయం రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.  ఈ ఆలయం ఉన్న ప్రాంతం ఎప్పుడు చాలా రద్దీ గా ఉంటుంది. చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో మరియు చుట్టూ అంతులేని ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే రహదారులతో చుట్టుముట్టబడి ఉంది. అయినప్పటికీ ఇది గందరగోళం మధ్య ఉన్న ఒక్క సారి ఈ ఆలయంలోనికి ప్రవేశించితే చాలా  ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం కోసం అనుకూలమైన స్థలం ఈ ఆలయం.  సాయంత్రం ఆర్తి సందర్శనకు ఉత్తమ సమయం. ఆలయ దర్శ...

100 Pillers Temple | Bodhan | Nizamabad | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాం 10వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర చెపుతుంది. ఈ ఆలయం నిజామాబాద్ లోని బోధన్ వద్ద కలదు. అప్పటి ఇంద్రా వల్లభుడు తన పేరు మీదనే ఇంద్రా నారాయణ పేరు తో ఆలయాన్ని నిర్మించాడు. ఈయన తరువాత కళ్యాణ రాజు ఈ అలయని చాలా అభివృద్ది చేశారు.  ఈ కాలంలోని రాజులు అప్పుడు అందరి కోసం విశాలమైన ప్రదేశం లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కొద్ది గా జైన మాత ఆలయాలు పోలి ఉంటుంది.  తారువతి కాలంలో అప్పటి రాజు యుద్దంలో ఓడిపోవడం రాజ్యం చేతుల నుంచి జరిపోయి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఈ అపురూప శిల్పకళా ఆలయన్ని ఇతర వాటికి వాడడం జరిగినది.  తారువత కాలక్రమంలో ఈ ఆలయాన్ని మసీదు గా కూడా మార్చారు. ఇప్పడు ఈ ఆలయాన్ని కాపాడే వారే లేరు. ఒక్కొక స్తంభం లోని శిల్ప కళా చూస్తే ఇప్పటి వారు కూడా ఇంత అద్భుతంగా నిర్మించరు అని చెప్పవచ్చు.  ఇప్పడు ఈ ఆలయం పూర్తిగా దెబ్బ తిని ఉన్నది, ఈ ఆలయన్ని రక్షించుకొకపోతే చరిత్రలో ఇంత మంచి అద్భుత శిల్ప కళా ఉన్న ఆలయాన్ని కోల్పోతాము.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 09:00 నుంచి 04:30  ఈ ఆలయాన్ని పట్టించుకొకపోవడం వల్ల ఈ ఆలయంలో అసాంఘిక కార్య...

Water Bidar Narasimha Swamy Temple | Bidar | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన మరియు చాలా శక్తివంతమైన ఆలయం. అని ఆలయాల వలె ఈ ఆలయం ఉండదు. ఈ ఆలయం సగం నీటి లో సగం నేల మీద ఉంటుంది. ఈ ఆలయం దర్శించాలి అంటే సాహసమే అని చెప్పాలి. అడ్వెంచర్ చేయాలి అని అనుకునే వారికి ఈ ఆలయం చాలా బాగా నచ్చుతుంది.  పూర్వం ఇక్కడ ప్రాంతంలో ఇప్పుడు పైన ఉన్న ఫోటోలో ఆధారంగా ఒక రాక్షసుడు ఉండే వాడు. అతను ప్రజలకి , లోకానికి ఎంతో హాని చేసేవాడు. స్థితి కారుడు ఐన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఈ నీటిలోని రక్షసుడుని సంహరించి అక్కడే వెలిశారు. ఇప్పటికి ఈ ఆచారం ఇక్కడ ఉన్నది. స్వామి ని మనం దర్శించుకోవాలి అంటే సుమారు 600 మీటర్ల దూరం మెడ వరకు లోతు వరకు నీటిని దాటుకొని వెళ్ళి స్వామి ని దర్శించుకోవలి.   ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక బోర్డర్ వద్ద గల బీదర్ అనే గ్రామంలో కలదు. ఇక్కడి వరకు బస్ మరియు కొద్ది దూరంలో ట్రైన్ సౌకర్యం కలదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 07:00  #Water #Bidar #Narasimha Swamy Temple #Bidar  #Hindu Temples Guide 

Sri Kethaki Sangameshwara Swamy Temple | Jharasangam | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి చాలా చరిత్ర కలదు. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శివుడు. ఇక్కడ శివునికి మొగలి పువ్వులతో పూజ చేస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత.  ఇక్కడ గుండం చాలా లోపలికి ఉంటుంది. కానీ నీరు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇక్కడి నీటికి చాలా మహిమలు ఉన్నాయి అని భక్తుల నమ్మకం. ఇక్కడి గుండంలో స్వామి వారికి నీరు లేదా ఇతర నైవేద్యాలు ఈ నీటిలో సమార్పిస్తే అది కాశీ లోని విశ్వనాధుడుకి చేరుతుంది అని నమ్మకం.  ఈ ఆలయంలో శివయ్య తో పాటు గణపతి , దుర్గా దేవి , పార్వతి దేవి ఇతర ఉప ఆలయాలు కలవు.  ప్రతి సం || మాఘ మాసం నుంచి శివ రాత్రి వరకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివ రాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ ఆలయంలో దీపాలు చాలా మంది పెడుతారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:30 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:30  వరకు  #Sri Kethaki Sangameshwara Swamy Temple  #Jharasangam #Hindu Temples Guide