Sri Shiva Anjaneya Swamy Temple | Upperpally | Hyderguda | Attapur | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి 3 దశాబ్దాలు పైనే ఐనది. ఈ ఆలయం హైదరాబాద్ చివరన ఉన్న అత్తాపూర్ , హైదర్ గూడ కి చివరన ఉప్పర్ పల్లి వద్ద కలదు. కోటి నుంచి ఈ ఆలయానికి 94 u అనే బస్ డైరెక్ట్ గా ఈ ఆలయం ఎదురుగు అగుతుంది. ఈ ఆలయం పార్కింగ్ కొంచం చిన్నగా ఉంటుంది. ఆలయ ప్రారంభంలోనే మనకి రాతి తో చెక్కబడిన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. పైన ఫోటోలో కూడా గమనించవచ్చు. 

ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ శివయ్య స్వామి. ఇక్కడ ప్రతి సం || శివయ్యకి శివరాత్రి రోజు చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివయ్య తో పాటుగా మనకి మొదట శ్రీ గణపతి స్వామి ని దర్శించుకోవచ్చు. స్వామి దర్శనం తరువాత శివయ్య దర్శనం చేసుకోవాలి. తరువాత నవగ్రహ మండపం కూడా కలదు. తరువాత శ్రీ దుర్గా దేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. తరువాత శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీ రామ నవమి , చాలా బాగా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:30 నుంచి 11:00 

మధ్యాన్నం : 11:00 నుంచి 04:45 బ్రేక్ 

సాయంత్రం : 04:45 నుంచి 07:45 

 


#Sri Shiva Anjaneya Swamy Temple #Upperpally #Hyderguda #Attapur #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana