Sri Gutta Pochamma Temple | Shaikpet | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ. ఇక్కడ అమ్మవారు ఒక గుట్ట లో వెలిసి ఉన్నారు. ఆ గుట్టకే అమ్మవారు అనుకోని ఉండడం స్వయంగా చూడవచ్చు. ఈ ఆలయం హైదరాబాద్ లోని షేక్పేట వద్ద గలదు. ఇక్కడ కి కొద్ది దూరంలో వరకు మాత్రమే బస్ ల సౌకర్యం కలదు. ఆలయం ఎదురుగా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు.
ఒక్కటే సరి 100 టూ విహీలర్ మరియు 50 ఫోర్ విహీలర్ బండ్లు వచ్చిన కూడా పార్కింగ్ చేయవచ్చు. ఇక్కడ అమ్మవారి ఆలయం ప్రారంభం లోనే పెద్ద రాజా గోపురం ని దర్శనం చేసుకోవచ్చు. అది దాటుకొని లోనికి ప్రవేశించగానే రాతి తో నిర్మించిన ఆలయ యొక్క ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచం ముందుకు ప్రవేశించగానే అమ్మవారి దివ్యమైన పాదాలు దర్శించుకోవచ్చు. ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం లోనికి ప్రవేశిస్తాము. లోపల ప్రశాంతమైన వాతావరణం , రంగు రంగుల చిత్రల పిల్లర్లు పెద్ద ఆలయం ప్రాంతం కనిపిస్తుంది.
ఇక్కడి నుంచి అమ్మవారి ఆలయం ఎదురుగా చూడగానే అమ్మవారు ఇక్కడ చాలా మందికి బాల రూపంలో కనిపిస్తుంది. ఆలయం ప్రదక్షిణ చేసి లోపలికి వెళుతూ ఉండగానే ఆలయం చుట్టూ పరివార దేవతలు దర్శించవచ్చు. ఇక్కడే సరిగ్గా ఆలయం వెనుక గుట్టకే చిన్న రంధ్రం ఉంది అక్కడి నుంచి అమ్మవారి కోసం ఒక సర్పం అప్పుడప్పుడు వస్తుంది అని అక్కడి అర్చకుల మాట. దీని రుజువు చేయడానికి అంతః రాలయం మీద ఒక నాగ సర్పం ప్రతీక చూడవచ్చు. ప్రతి సం ఆషాడ మాసంలోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మరియు ఆదివారం రోజులలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:45
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు

Comments
Post a Comment