Shri Somanath Temple | Dhobi Ghat | Talabkatta | Yakutpura | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు  500 సం || క్రితమే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని ధోబి ఘాట్ వద్ద గల అమన్ నగర్ , భవానీ నగర్ మధ్యలో యకత్ పుర్ అనే గ్రామంలో కలదు. ఇది అంతా ముస్లిం ఆక్రమిత ఓల్డ్ సిటీ లో కలదు. ఈ ఆలయం లోని శివ లింగం స్వయంభూ శివలింగం. చాలా పాతా ఆలయం ఐనప్పటికి శిల్ప కల ఆలయం ఏ మాత్రం చెక్కు చెదరలేదు.   

ఈ ఆలయం లో మనకి చాలా విశేషాలు కనిపిస్తాయి.  ఇక్కడ చాలా పెద్ద మరియు చాలా లోతైన నీటి భావి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 8 వ శతాబ్దం నుంచి ఒక్కటే కుటుంబం వారు పరిరక్షితున్నారు. ఈ ఆలయం లో చాలా పెద్ద స్వయంభూ శివలింగం ని దర్శించవచ్చు. ఇక్కడ ఆలయంలో భావి లోని నీరు ఎప్పుడు ఒక్కటే విధంగా ఉంటాయి. 

ఇక్కడ ఒక పెద్ద చెట్టు లో నుంచి వచ్చిన శివలింగ గమనించవచ్చు. మరియు ఆది కూడా రాతితో ఉన్న నంది మీద ఉంటుంది. ఇక్కడ స్వయంభూ శివలింగం తో పాటుగా మనకి గణపతి , దుర్గాదేవి , సంతోషిమాతా కూడా దర్శనం ఇస్తారు. శివరాత్రి రోజు రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు స్వామీ వారికి కళ్యాణం కూడా చేస్తారు. ప్రతి సోమవారం , మాస శివరాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. 


ఆలయ దర్శనం సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 


#Shri Somanath Temple #Dhobi Ghat #Talabkatta #Yakutpura #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana