Sri Dhana Laxmi Temple | Ammerpet | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ లోని అమీర్ పేట x రోడ్డు మీద ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. ద్విచక్ర వాహనం కి కూడా పార్కింగ్ లేదు.
ఈ ఆలయం లో ప్రధాన దేవత శ్రీ ధనలక్ష్మీ దేవి. ఇక్కడ అమ్మవారి చాలా సం || క్రితం నుంచే వెలిశారు. ఈ ఆలయంలో మొదట మనకి శ్రీ విజ్ఞ వినాయకుడు దర్శనం ఇస్తారు. పక్కనే దుర్గా దేవి దర్శనం ఇస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం ప్రారంభం అవుతుంది. ఇక్కడ అమ్మవారికి చూడడానికి రెండు కన్నులు సరిపోవు. ఇక్కడ ధనలక్ష్మీ అమ్మవారిని అంత అందంగా అలంకరణ చేస్తారు. ప్రతి సం ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దేవి నవరాత్రి లలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. దీపావళి రోజు ఈ ఆలయం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:00
మధ్యాన్నం : 11:00 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Dhana Laxmi Temple #Ammerpet #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment