Sri Lakshmi Narasimha Swamy Temple | Peerzadiguda | Parvathapuram | Hyderabad | Hindu Temples guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని ఉప్పల్ కి 8కి.మీ దూరంలో కలదు. ఈ దేవాలయం బయటి నుంచి చూడడానికి చిన్నగా ఉన్న లోపల కొంచం పెద్దగానే ఉంటుంది. 

పూర్వం ఇక్కడ యాదమ్మ అనే భక్తురాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కోసం యదగిరి గుట్ట లో స్వామి కొలుస్తూ ఉండగా ఒక రోజు స్వామి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని కోరగా తాను స్థలాలను వెతకడం ప్రారంభించినది. ఆమెకి నచ్చిన ప్రాంతంలో ఒక పెద్ద నాగదేవత పుట్ట ఉన్నది. ఇప్పటికి అందులో పాలు సమర్పిస్తారు. 

ఈ పుట్ట నుంచి కొద్ది అడుగుల దూరంలోనే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శనం ఇస్తుంది. స్వామి సుమారు 6 అడుగుల ఎత్తులో చక్కటి విగ్రహంతో స్వామి అమ్మవారితో కనిపిస్తారు. 

ఇక్కడ స్వామి తో పాటుగా ఉప ఆలయాలు కలవు. అందులో శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి దేవాలయాలు కలవు. ఇక్కడ చక్కటి యగశాల కూడా ఉన్నది. ప్రతి సం || వైకుంఠ ఏకాదశి రోజున మరియు దీపావళి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.


ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్

సాయంత్రం : 04:30 నుంచి 07:30 వరకు 


#Sri Lakshmi Narasimha Swamy Temple #Parvathapuram #Peerzadiguda #Hyderabad #Hindu Temples guide

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide