Sphatik Mahadev Shiva Mandir | Beside Charminar | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఇక్కడికి వచ్చిన కూడా చాలా మంది అంతా గమనించకుండానే వెళ్లిపోతారు. మీ జాతకం ఎంత నీచ స్థితిలో ఉన్న కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఒక్క సరి మనస్సు పూర్తిగా కొలిస్తే స్వామి వారికి ఏదో ఒక దారి చూపిస్తారు అని భక్తుల నమ్మకం. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవి ఆలయం వెనుక అనగా చార్మినార్ నుంచి అఫ్జల్ గంజ్ కి వెళ్ళే మార్గంలో ఎడమ వైపు ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పాల రాతి తో నిర్మించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఈ ఆలయంలో స్వామి మొట్ట మొదట మొత్తం దక్షిణ భారతదేశంలో మొదటి స్పటిక శివ లింగం అని పేరు ఉన్నది. 

ఈ ఆలయంలో 1857 సం || లో నిర్మించారు. అప్పుడు చాలా పాతగా ఉండడం వల్ల కొన్ని సం || అనగ 15 సం || క్రితమే పునః నిర్మాణం చేపించారు. ఈ ఆలయంలో మనకి మొదట వెళ్ళగానే 31 తల లతో శివయ్య దర్శనం ఇస్తారు. ఆ పక్కనే స్పటిక శివ లింగం కలదు. వెనుక గణపతి కూడా ఉంటారు. 

ఈ ఆలయంలో మనకి శివలింగం తో పాటుగా శ్రీ లక్ష్మీ నారాయణులు , సంతోషిమాతా , దుర్గా దేవి , శ్రీ ఆంజనేయ స్వామి , సాయి బాబా తో పాటుగా నవగ్రహాలు కూడా దర్శనం చేసుకోవచ్చు. అభిషేకం కొరకు టికెట్ తీసుకోవాలి. ఈ ఆలయ పూర్తిగా పాలరాతి తో నిర్మించడం వల్ల మనస్సుని ఇట్టే ఆకట్టుకుంటుంది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 


#Sphatik Mahadev Shiva Mandir  #Beside Charminar  #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana