Sri Abhaya Anjaneya Swami Temple | Jagadirgutta | Kuketpally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. పైన ఫోటో లో చూపించిన విధంగా ఆలయం ముందే పార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆలయం హైదరాబాద్ లోని కుకెట్ పల్లి మరియు జగ్గదిర్ గుట్ట కి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీదనే ఉండడం వల్ల విపరీతమైన సౌండ్ వస్తుంది.
ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ పక్కనే శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి ఆలయం కూడా ఉన్నది. శ్రీ రామ నవమి , దసరా , దీపావళి రోజున ఈ ఆలయం లో చాలా రద్దీ గా ఉంటుంది.
ఈ ఆలయం ప్రక్కనే శివాలయం కూడా ఉన్నది. ప్రతి సం || శివరాత్రి రోజున స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు , బిలవార్చన , హోమం కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ నవమి రోజున స్వామి వారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 11:00
మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Abhaya Anjaneya Swami Temple #Jagadirgutta #Kuketpally #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment