Sri Bangaru Gavvala Renuka Yellamaa Temple | Vinayaka Nagar Colony | Satya Nagar | Kothapet | Hyderabad
ఈ ఆలయం చాలా మహిమ గల ఆలయం. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు. తెలంగాణ సంప్రదాయంలో ఈ అమ్మవారిని చాలా ఎక్కువగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారిని కొందరు వారి ఇంటి ఆడపడుచుగా కూడా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు పేరు శ్రీ బంగారు గవ్వల రేణుక ఎల్లమ్మ అమ్మవారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని కొత్తపేట వద్ద గల వినాయక నగర్ కాలనీ , సత్యనాగర్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఆలయం కొంచం చిన్నగానే ఉంటుంది. కానీ చాలా మహిమ గల అమ్మవారు.
ఇక్కడ ప్రతి సం || ఆషాడ మాసంలో భారీ ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మరియు దసరా నవరాత్రిలో చాలా ఘనంగా పూజలు నిర్వహిసారు. అప్పుడు అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక అభిషేకాలు , ప్రత్యేక హోమలు కూడా నిర్వహిషారు. మంగళవారం మరియు శుక్రవారం కొంచం రద్దీగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:30 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:30 బ్రేక్
సాయంత్రం : 05:30 నుంచి 07:45 వరకు
#Sri Bangaru Gavvala Renuka Yellamaa Temple #Vinayaka nagar colony #Satyanagar #Kothapet #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment