100 Pillers Temple | Bodhan | Nizamabad | Telangana | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాం 10వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర చెపుతుంది. ఈ ఆలయం నిజామాబాద్ లోని బోధన్ వద్ద కలదు. అప్పటి ఇంద్రా వల్లభుడు తన పేరు మీదనే ఇంద్రా నారాయణ పేరు తో ఆలయాన్ని నిర్మించాడు. ఈయన తరువాత కళ్యాణ రాజు ఈ అలయని చాలా అభివృద్ది చేశారు.
ఈ కాలంలోని రాజులు అప్పుడు అందరి కోసం విశాలమైన ప్రదేశం లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కొద్ది గా జైన మాత ఆలయాలు పోలి ఉంటుంది. తారువతి కాలంలో అప్పటి రాజు యుద్దంలో ఓడిపోవడం రాజ్యం చేతుల నుంచి జరిపోయి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఈ అపురూప శిల్పకళా ఆలయన్ని ఇతర వాటికి వాడడం జరిగినది.
తారువత కాలక్రమంలో ఈ ఆలయాన్ని మసీదు గా కూడా మార్చారు. ఇప్పడు ఈ ఆలయాన్ని కాపాడే వారే లేరు. ఒక్కొక స్తంభం లోని శిల్ప కళా చూస్తే ఇప్పటి వారు కూడా ఇంత అద్భుతంగా నిర్మించరు అని చెప్పవచ్చు.
ఇప్పడు ఈ ఆలయం పూర్తిగా దెబ్బ తిని ఉన్నది, ఈ ఆలయన్ని రక్షించుకొకపోతే చరిత్రలో ఇంత మంచి అద్భుత శిల్ప కళా ఉన్న ఆలయాన్ని కోల్పోతాము.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 09:00 నుంచి 04:30
ఈ ఆలయాన్ని పట్టించుకొకపోవడం వల్ల ఈ ఆలయంలో అసాంఘిక కార్యక్రమలు నిర్వహిస్తున్నారు.
#100 Pillers Temple #Bodhan #Nizamabad #Telangana #Hindu Temples Guide

Comments
Post a Comment