Swayambhu Patala Hanuman Temple | Bahadurpura | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. దాదాపు ఈ ఆలయం 700 సం || నుంచి ఉన్నట్టుగా ఇక్కడి పూర్వీకులు , స్థానికులు చెప్పడం జరిగినది. పక్కన శ్రీ రామాలయం , కుడి వైపున పుట్టలో అమ్మవారు కలరు.
ఈ దేవాలయంలో స్వామి వారి విగ్రహం యొక్క దేహం తూర్పు దిక్కుకు చూస్తూ ముఖం ఉత్తర దిక్కును చూస్తూ ఉన్నట్టు గా గమనించవచ్చు. ఇలా మనకు ఎక్కడ కనిపించకపోవడం విశేషం. ఇది ఎవరు ఎప్పుడు ప్రతిష్టించారో ఎంత ప్రయత్నించిన తెలియని విషయం.
ఈ స్వామి స్వయంభూ హనుమాన్ విగ్రహం వెనుక ఉన్న బావి నుంచి 150 అడుగుల భూగర్భం నుంచి బయటికి తీసి పూజలు చేశారు కావున ఈ హనుమాన్ స్వామి కి స్వయంభూ పాతాళ హనుమాన్ అనే పేరు వచ్చినది. అందుకే దీనిని మహిమా గల స్వామి అని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయం లో కోరిన కోరికలు నేరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇంతటి మహిమ గలిగిన శ్రీ ఆంజనేయ స్వామి నల్లని కాంతి కలిగిన విగ్రహ దర్శనం చూడడం అదృష్టం అని చెప్పవచ్చు. ఈ ఆలయం వెనుక శ్రీ పుట్ట కూడా ఉన్నది పక్కనే శ్రీ ఎల్లమ్మా అమ్మవారు కూడా ఉన్నారు. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న కూడా చాలా మహిమ గల ఆలయం. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. మరియు ఆలయం చిన్నగా ఉంటుంది. ఈ హనుమాన్ ఆలయం ముస్లిం ఆధీనంలో ఉండడం వల్ల భక్తుల ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. కానీ ఇన్ని సం || నుంచి ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆ ఆలయ ట్రస్ట్ వాళ్ళకి సహాయం చేయడం మన అందరి మీద ఉన్న భాద్యత.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:00
మధ్యాన్నం : 11:30 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30
#Swayambhu Patala Hanuman Temple #Bahadurpura #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment