Sri Sai Baba Temple | Attapur | Hyderguda | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇప్పడు ఈ ఆలయాన్ని పునః నిర్మించారు. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మార్పులు చేశారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందిపట్నం కి 7 కి. మీ దూరంలో ఉన్న అత్తాపూర్ గ్రామం లో PVNR Expressway పిల్లర్ నంబర్ 125 ఎదురుగా కొద్దిగా లోపలికి ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ శిరిడీ సాయి బాబా. ప్రతి గురువారం రోజు మధ్యాన్నం సమయంలో అన్నదాన ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఆలయం లోపలికి ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం లో ఉంటుంది. కానీ సరియైన కార్ పార్కింగ్ లేదు. ఈ ఆలయంలో శ్రీ సాయి బాబా తో పాటుగా శ్రీ శివయ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. 

ఈ ఆలయంలో గురుపూర్ణిమ , శ్రీ రామ నవమి , దసరా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దేవి నవరాత్రి సమయంలో ప్రతి రోజు చండీ హోమం కూడా నిర్వహిస్తారు. శివరాత్రి రోజు కూడా రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:00 

మధ్యాన్నం : 11:00 నుంచి 05:45 బ్రేక్ 

సాయంత్రం : 06:00 నుంచి 08:00 


#Sri Sai Baba Temple #Attapur #Hyderguda #Hyderabad #Hindu Temples Guide   

Comments