Sri Surya Bhagavan Temple | Hyderguda | Attapur | Hyderabad | Hindu Temples Guide
మనకి శ్రీ సూర్య భగవణుని ఆలయాలు కనిపించడం చాలా అరుదు. ఒకటి ఆంధ్ర లో ఉంటే ఇంకోటి మన తెలంగాణలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. పైన ఫోటోలో చూస్తేనే మీకు అర్ధం అవుతుంది. మొత్తం రాతితో నిర్మించిన ఆలయం ఈ సూర్య దేవునియ ఆలయం.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల హైదర్ గూడ కి కొద్ది దూరంలో శ్రీ విధ్యానికేతన్ అనే స్కూల్ కి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రశాంతమైనా వాతావరణంలో ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ లో కూడా ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో మనకి ఇతర దేవత మూర్తులని కూడా దర్శించుకోవచ్చు.
ఈ ఆలయంలో ప్రధానంగా సప్త గుర్రాలతో శ్రీ సూర్య భగవానుడు , ఛాయా దేవి , శ్రీ దుర్గా దేవి , శ్రీ మహాలక్ష్మీ దేవి కూడా దర్శించవచ్చు. బయట కొద్ది దూరంలోనే శివాలయం కూడా దర్శించవచ్చు. రావి చెట్టు కింద శ్రీ నాగదేవత విగ్రహాలు కూడా దర్శించవచ్చు.
ఆలయం అవరంలోనే ప్రక్కనే శ్రీ సూర్య దేవాలయ గోశాల కూడ ఉన్నది. స్వామి వారికి మరియు శివయ్య కి ఆవు పాలతో అభిషేకం చేస్తారు. మనం కూడా అభిషేకం చేయవచ్చు. బయట హోమ గుండం కూడా ఉన్నది. ఇక్కడ హోమలు కూడా చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:00
మధ్యాన్నం : 11:30 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 04:45 నుంచి 07:00 వరకు
#Sri Surya Bhagavan Temple #Hyderguda #Attapur #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment