Shivala Ghat Shiva Mandir | Purana pool | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 400 సం || కంటే పురతనమైనది. అంటే చార్మినార్ కంటే కూడా పాతది ఈ శివాలయం. ఈ ఆలయం మనకి చాలా విశేషమైన శివాలయం ఎందుకు అనగా ఈ ఆలయం లో మనకి శివలింగం బ్రహ్మ సూత్రం తో కలిగి ఉంటుంది. అనగా కోటి సార్లు శివాలయం కి వెళితే ఎంత పుణ్యం లాభిస్తుందో అంతడి పుణ్యం ఈ ఆలయం లో ఒక్క సరి వెళితే కలుగుతుంది. మీ అదృష్టం పొందితే కానీ మీరు ఇటువంటి బ్రహ్మ సూత్ర శివలింగం ఆలయంలోనికి ప్రవేశించారు. అంతటి గొప్ప ఆలయం ఈ ఆలయం.
ఈ ఆలయం హైదరాబాద్ లోని పురాణ పూల్ బ్రిజ్ పక్కనే ఉంటుంది. బయటి నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద ఉంటుంది. ఈ ఆలయం పూర్వం ఒక వ్యక్తి కి తాను ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా ఈ శివా లింగం కనిపించడం వల్ల అక్కడే ప్రతిస్టా చేశారు.
ఈ ఆలయంలో మన చేతులతో మనమే స్వయంగా స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కానీ సోమవారం మరియు మాస శివరాత్రి మరియు ప్రత్యేక రోజులలో మినహాయింపు. ఈ ఆలయం అంతా రాతి తో నిర్మించారు. ఇప్పుడు లోపల కొంచం మార్పులు చేయడం జరిగినది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:50 వరకు
#Shivala Ghat Shiva Mandir #Purana pool #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment