Sri Kodanda Rama Swamy Temple | Gowlipura | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. హైదరాబాద్ లోని గౌలిపురా లో 18 వ వీధిలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం కొద్దిగా లోపలికి ఉంటుంది. కానీ చాలా పురాతన ఆలయం. మీరు లోపలికి వెళ్ళే ముందే ఆలయం ప్రహరీ గోడ యొక్క ప్రధాన ద్వారం చూస్తేనే తెలుస్తుంది. చాలా పెద్ద ద్వారం కలదు.
ఈ ఆలయం ప్రధాన ద్వారం దాటుకొని ముందుకు వెలగానే మొదట మనకి 25 అడుగుల ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అది కూడా దాటుకొని వెల్లగానే మారియొక్క గోపురం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రధాన ఆలయం లోనికి వెలుతాము. ఇక్కడ శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి ప్రధాన దేవత మూర్తులు కనిపిస్తాయి. ఇక్కడ ఆలయ సంరక్షకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు.
ఇక్కడ ప్రతి సం || శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , దసరా , దీపావళి మరియు ఇతర పండుగల సమయంలలో రద్దీ చాలా ఎక్కువగ ఉంటుంది. ఈ ప్రాంతం కొంచం సున్నితమైన ప్రాంతం. ఇతర మతస్థుల ప్రాబల్యం ఎక్కువగ ఉన్న కూడా మొదటి నుంచి ఇక్కడ ఆలయం ఉండడం అంతటి పురాతన ఆలయం రక్షించుకొడవం మన అందరి బాధ్యత.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:45 నుంచి 10:45
మధ్యాన్నం : 11:30 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 04:45 నుంచి 08:00 వరకు
#Sri Kodanda Rama Swamy Temple #Gowlipura #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment