Sri Venkateswara Swamy Temple | KPHB Phase 3 | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 32 సం || అవుతుంది. ఈ ఆలయం హైదరాబాద్ లోని ప్రధాన నగరం కుకెట్ పల్లి , హౌసింగ్ బోర్డు 3వ ఫేజ్ వద్ద బస్ స్టాప్ కి కొద్ది దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లోపల చాలా పెద్దగా ఉంది. కానీ సరియైన కార్ పార్కింగ్ సౌకర్యం అంతగా లేదు. చాలా చిన్నగా ఉంటుంది పార్కింగ్ స్థలము. 

ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధాన దేవత మూర్తి. మనం ఆలయ గెట్ దాటి లోపలికి వెళ్ళగానే మొట్ట మొదట విజ్ఞ వినాయకుడు దర్శనం ఇస్తారు. అట్టు పక్కనే శ్రీ రామ భక్తుడు ఐనటు వంటి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. తరువాత కొన్ని మెట్లు ఎక్కిన తరువాత జగత్ గురువు శ్రీ ఆది శంకరాచార్య స్వామి దర్శనం చేసుకోవాలి. తరువాత ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే ఇక్కడే కలియుగ ప్రత్యక్ష రూపం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపం దర్శనం ఇస్తారు. 

ఇక్కడ మనకి రెండు పక్కల శ్రీ దేవి , భూదేవి , స్వామి వారి అంతరాలయం లో శ్రీ పద్మావతి అమ్మవారు కనిపిస్తారు. ఆలయం వెనుక శ్రీ ఆండాళ్ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే పెద్ద హాల్ కూడా ఉన్నది. శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , దసరా , దీపావళి మరియు ఇతర ప్రధాన రోజులలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రావి చెట్టు కింద నాగదేవత విగ్రహాలు , పెద్ద పుట్టని కూడా చూడవచ్చు 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు 


#Sri Venkateswara Swamy Temple #KPHB Phase 3 #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana