Sri Gandimaisamma Temple | Gandipet | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం హైదరాబాద్ లోని గండిపేట వద్ద కలదు. ఈ ఆలయం లోపలికి వెళ్ళలీ అంటే ఒక పైప్ లైన్ చిన్న స్వరంగా మార్గం నుంచి ఆలయం లోపలికి వెళ్ళాలి. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి కేవలం 20 కి,మీ దూరంలో కలదు. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఉంటుంది. చాలా చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ గండిమైసమ్మ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అత్యంత శక్తివంతమైయాన అమ్మవారు. ఇక్కడ అమ్మవారు బోనాల పండుగ మరియు దసరా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఈ ఆలయం వెనుక పెద్ద గండిపేట చెరువు ఉన్నది. పూర్వం మరియు ఇప్పడు కూడా హైదరాబాద్ కి తాగు నీరు ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. పూర్వం హైదరాబాద్ పరిపాలించిన రాజులు కూడా ఇక్కడ అమ్మవారికి పూజ చేసే వారు అని ఇక్కడి అర్చకులు చెప్పేవారు.
ఈ ఆలయానికి ఈ పేరు రావడానికి ఇక్కడ అమ్మవారు గండాల నుంచి రక్షణగా ఉండడం వల్ల ఇక్కడ అమ్మవారికి ఈ పేరు వచ్చినది. ఆలయ ప్రారంభంలోనే రాతి తో నిర్మించిన చిన్న ధ్వజ స్తంభం కలదు.
ఇక్కడి అమ్మవారికి నాన్ వెజ్ నైవేద్యం సమర్పిస్తారు.
ఆలయ దర్శనం సమయం :
ఉదయం : 06:00 నుంచి సాయంత్రం 06:00 వరకు మాత్రమే.

Comments
Post a Comment