Sri Naga Sai Mandir | Shiridi Hills | Jagadir gutta | kuketpally | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని చూడాలి అంటే కొండ మీద వరకు వెళ్ళాలి. ఈ ఆలయం హైదరాబాద్ లోని కుక్కేట్ పల్లి వద్ద గల జగ్గదిర్ గుట్ట వద్ద గల శిరిడీ హీల్స్ వద్ద ఈ ఆలయన్ని చూడవచ్చు. 

ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి ధ్యాన ముద్రలో శివయ్య ని చూడవచ్చు. ప్రారంభం నుంచే చక్కటి పెయింటింగ్ తో చూపు అక్కడే నిలబడిపోయేటట్టు ఉంటాయి. సరస్వతి దేవి , లక్ష్మీ దేవి , ద్వాదశ జ్యోతిర్లింగాలు , కంచి కామాక్షి దేవి , ఇతర పెయింటింగ్ లు చూపులని ఇట్టే ఆకట్టుకుంటాయి. తరువాత గణపతి ఆలయం , హోమగుండం కనిపిస్తుంది. 

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఆలయం లోపల మనకి గోశాల కనిపిస్తుంది. అక్కడే చిన్నటి రాధాకృష్ణుడి విగ్రహం తో చూడవచ్చు. తరువాత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , ఒక రావి చెట్టు కింద అష్ట లక్ష్మీ దేవుల విగ్రహాలు మరియు నాగదేవత విగ్రహాలు చూడవచ్చు. తరువాత కొంచం ముందుకు వెళితే చక్కటి శివ లింగం కనిపిస్తుంది. 

తరువాత శ్రీ దుర్గా దేవి ఆలయన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతి సం || దసరా భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మ వారికి కూరగాయాలతో అలంకారం ప్రత్యేక ఆకర్షణ. తరువాత పెద్ద శివ లింగం గోపురంతో నిర్మించి అందులో సాయి బాబా విగ్రహం ని ఏర్పాటు చేశారు. అది దాటుకొని కొండ మీదకి వెళ్ళితే అక్కడ ఆలయ ప్రధాన దేవత మూర్తి శ్రీ సాయి బాబా ఆలయం ఉంటుంది. కొండ కింద పెద్ద హాల్ కలదు. ప్రతి గురువారం రోజు మరియు గురు పూర్ణిమ రోజు ఇక్కడ అన్నదానం చేస్తారు. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:45 

మధ్యాన్నం : 11:45 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:25 వరకు 


 #Sri Naga Sai Mandir #Shiridi Hills #Jagadir gutta #kuketpally #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana