Sri Ramalingeshwara Swamy Temple | Damagundam | Puduru | Hindu Temples Guide

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ కి సుమారు 70 కి. మీ దూరంలో పూడూరు గ్రామానికి కేవలం 4 కి . మీ దూరంలో కలదు. ప్రస్తుతం ఈ ఆలయం కాలక్రమంలో పరిగి వెళ్ళే మార్గంలో ఉన్నది అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఇక్కడ శ్రీ మహావిష్ణువు శివునికి ప్రధమ భక్తుడిగా ఉంటారు. ఈ ఆలయ మహత్యాన్ని స్కంద పురాణంలో కూడా తెలుపడం జరిగినది. 

ఈ ఆలయం చుట్టూ నీరు మధ్యలో శివాలయం ఉంటుంది. ఇక్కడ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి లో స్నానం ఆచరిస్తే రోగాలు నయం అవుతాయి అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని ఇక్కడి శాసనాల ద్వారా తెల్సుకోవచ్చు. పూర్వం శ్రీ రాముల వారు కోటి లింగాలు ప్రతిష్ట చేశారు అని అందులో ఈ లింగం కూడ ఉన్నది అని చరిత్ర చెపుతుంది. మరియు మారియొక్క కథ కూడా ప్రాచుర్యంలో కలదు. పూర్వం ఇద్దరు వ్యక్తులు తమ పొలం లో నాగలి తో పొలం దున్నుతు ఉండగా ఆ నాగలి కి తగిలి స్వామి వారు ఆ ఇద్దరి యాక్టులకి కలలో కనిపించి తారు ఎక్కడ ఐతే దర్శనం ఇస్తానో అక్కడే ప్రతిష్ట చేయాలి అని చెప్పగా వారు అలానే చేశారు వారు పేరు మీదనే దాము గుండం పేరునే దాము గూడెం అనే పేరు వచ్చినది. 

ఈ ఆలయం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే మంచిది. ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం చాలా చిన్నగా ప్రశాంతం ఉంటుంది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి సాయంత్రం 05:00   


#Sri Ramalingeshwara Swamy Temple #Damagundam #Puduru #Hindu Temples Guide

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana