Water Bidar Narasimha Swamy Temple | Bidar | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన మరియు చాలా శక్తివంతమైన ఆలయం. అని ఆలయాల వలె ఈ ఆలయం ఉండదు. ఈ ఆలయం సగం నీటి లో సగం నేల మీద ఉంటుంది. ఈ ఆలయం దర్శించాలి అంటే సాహసమే అని చెప్పాలి. అడ్వెంచర్ చేయాలి అని అనుకునే వారికి ఈ ఆలయం చాలా బాగా నచ్చుతుంది. 

పూర్వం ఇక్కడ ప్రాంతంలో ఇప్పుడు పైన ఉన్న ఫోటోలో ఆధారంగా ఒక రాక్షసుడు ఉండే వాడు. అతను ప్రజలకి , లోకానికి ఎంతో హాని చేసేవాడు. స్థితి కారుడు ఐన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఈ నీటిలోని రక్షసుడుని సంహరించి అక్కడే వెలిశారు. ఇప్పటికి ఈ ఆచారం ఇక్కడ ఉన్నది. స్వామి ని మనం దర్శించుకోవాలి అంటే సుమారు 600 మీటర్ల దూరం మెడ వరకు లోతు వరకు నీటిని దాటుకొని వెళ్ళి స్వామి ని దర్శించుకోవలి.  

ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక బోర్డర్ వద్ద గల బీదర్ అనే గ్రామంలో కలదు. ఇక్కడి వరకు బస్ మరియు కొద్ది దూరంలో ట్రైన్ సౌకర్యం కలదు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07:00 


#Water #Bidar #Narasimha Swamy Temple #Bidar  #Hindu Temples Guide 

Comments