Sri Jataagiri Shankara Dasamaiah Shiva Temple | Fatehdarwaza | Doodhbowli | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లోపల కట్టడం గురించి చూస్తేనే మీరే అంటారు ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు అని. చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం మనకి ప్రధాన రహదారి మీదనే నుంచే కనిపిస్తుంది. 

ఈ ఆలయం ఫతేదర్వాజ వద్దగల దూద్ బౌలీ హైదరాబాద్ లో కలదు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ చాలా మహిమ గల ఆలయం. ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. వాహనలు వేరే ప్రాంతంలో వదిలి రావడం ఉత్తమం. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ శివయ్య తండ్రి. మనకి ప్రారంభంలోనే శ్రీ గణపతి స్వామిని దర్శించుకోవాలి. తరువాత ఇక్కడ ఆలయ రక్షకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి ఉండడం విశేషం. ఈ ఆలయంలో స్వామిని శ్రీ జఠగిరి శంకరదాసమయ్య దేవాలయం గా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ప్రతి సోమవారం మరియు మాస శివరాత్రి రోజు అధిక రద్దీ కలదు. శివరాత్రి రోజు ఐతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా సోమవారం మినహా మిగిలిన రోజులలో స్వామికి మన చేతులతో స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయం వారు కలిపించారు. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 07:45 


#Sri Jataagiri Shankara Dasamaiah Shiva Temple #Moinpura #Fatehdarwaza #Shah Gunj #Doodhbowli #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana