Sri Vijaya Ganapathi Temple | Sun City | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చేవేళ్ళ రోడ్డు మీదుగా ఉంటుంది. కానీ మనం ఈ ఆలయానికి చాలా త్వరగానే చేరుకోవచ్చు. ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందిపట్నం నుంచి చిలకూరు బాలాజీ కి వెళ్ళే బస్ ఈ ఆలయం ముందు నుంచే వెళుతుంది. మనం హైదర్శ కోట్ అనే చెప్పితే ఇక్కడ దింపుతారు. బస్ స్టాండ్ నుంచి కేవలం 5 నిమిషాలు నడిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి కార్ మరియు ఇతర పెద్ద వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. ద్వి చక్ర వాహనాలు కూడా బయట పార్కింగ్ చేయాలి.
ఈ ఆలయం లోపల చాలా బాగా ఉంటుంది. ఏ ఇతర ఆలయం లో లేని ప్రత్యేకత ఈ ఆలయంలో కలదు. ఈ ఆలయంలో గణపతి , సుబ్రమణ్య స్వామి , అయ్యప్ప స్వామి శివాయ తండ్రి , శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి పక్క పక్కనే కనిపిస్తారు. ఈ ఆలయంలో గణపతి స్వామి విశేష గరిక పూజ చేస్తారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కి పూజలు చేస్తారు. అయ్యప్ప స్వామి కి కూడా విశేష పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం శివయ్య తండ్రికి అభిషేకం మరియు శివరాత్రికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం లోపల నవగ్రహ మండపం , గోశాల కూడా ఉన్నాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:30 బ్రేక్
సాయంత్రం : 05:30 నుంచి 08:00
#Sri Vijaya Ganapathi Temple #Sun City #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment