Posts

Showing posts from December, 2024

Sri Laxmi Narasimha swamy temple | Moosapet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 250 సం || కంటే పూర్వమే నుంచి ఉన్నది అని చరిత్ర. ఈ ఆలయాన్ని పూర్వం ఒక భక్తుడు స్వామి వారి కోసం తీవ్రమైన తప్పసు చేయగా స్వామి ఆ వ్యక్తికి కలలో నేను ఇక్కడే ఉన్నాను అని అనగా ఉదయమే వెళ్ళి చూడగా ఒక కొండలో మధ్యలో స్వామి వారిని చూస్తాడు.  ఈ ఆలయం అంచలు అంచలు గా అభివృద్ది చెందుతూ వచ్చింది. ఇక్కడ స్వామి వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించు కోవచ్చు. ఇక్కడ స్వామీ వారి వాహనం ఐన శ్రీ గరుత్మంతుడు స్వామి వారి ధ్వజ స్తంభం మీద దర్శించు కోవచ్చు. మరియు ఈ ఆలయంలో నవగ్రహ మండపం కూడా ఉన్నది.  ఆలయం దర్శన సమయం : ఉదయం : 06:30 నుంచి 11:30 వరకు  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు  #Sri Laxmi Narasimha swamy temple  #Moosapet #Hyderabad Temples #Hindu Temples Guide

Satya Datta Sadhanalaya | Yadarpalli | Keesara | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పేరు శ్రీ సత్య దత్త సాధనాలయా. ఈ ఆలయం సికింద్రాబాద్ హైదరాబాద్ కి మధ్యలో గల కీసర మండలం , యాదర్పల్లి గ్రామంలో కలదు. ఈ ఆలయం ఫోటో 2019 లో ప్రారంబించిన అప్పటి ఫోటో. ఈ ఆలయం సరిగ్గా 5 సం || క్రితం అనగా సెప్టెంబర్ 3,4 తేదీ లలో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో కి అడుగు పెట్టగానే అస్సలు వస్తు ఉండడం తోనే ఏదో మనసుకి తెలియని ప్రశాంతత , అడవిలో కి వచ్చిన అనుభూతి కలుగుతుంది. వివాహం ఆలస్యం కావడం , ఉద్యోగం దొరుకాక పోవడం , ఏ పని జరగాలి అని ప్రారంభించిన ఆది లోనే ఆటంకాలు రావడం , గురు గ్రహం బలం తక్కువగా ఉన్న వారు దక్షిణ మూర్తి స్వామిని (లేదా) దత్తాత్రేయ స్వామి (లేదా) రాఘవేంద్ర స్వామి (లేదా) లలితా దేవిని పూజ చేయాలి. వీరు అందరూ గురు స్వరూపంతో ఉండే దేవత మూర్తులు. దత్తాత్రేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ భగవత్ గీత మరియు భాగవతం పారాయణ కూడా చేస్తారు.  ఇక్కడ అమ్మవారు , కృష్ణా , శ్రీ దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు. అన్నీ అలయాలో మాదిరిగా కాకుండా అస్సలు దత్తత్రేయ స్వామిని ఇక్కడ దర్శించవచ్చు. అనగ ఇక్కడ స్వామి తెల్లరాత్రి రూపంలో బ్రహ్మ , విష్ణు , మహేశ్వర  రూపంతో ఏకశిలా రూపంతో దర్శించుకోవచ్చు....

Chiryala Sri Laxmi Narsimha Swami Temple | Cheeryala | Keesara | Secunderabad | Hindu Temples guide

Image
 ఈ ఆలయం హైదరాబాద్ సికింద్రాబాద్ కి మధ్యలో గల కీసర అనే గ్రామం వద్ద గల చిర్యాల అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం ప్రపంచంలోనే ఆది పొడవాడైన ప్రవేశ ద్వారం కలిగిన ఆలయం. ఈ ఆలయం ప్రవేశ ద్వారం నుంచి ఈ ఆలయం 4.5 కి. మీ దూరంలో కలదు.  ఈ ఆలయం పూర్వం లక్ష్మయ్య అనే వ్యక్తి నరసింహ కి పెద్ద భక్తుడు. అతనికి స్వామి కలలో కనిపించి నా దర్శనానికి రా అని పిలువగా తాను యాదగిరి గుట్ట లో స్వామి దర్శనం చేసుకున్న తరువాత తాను కూడా స్వామి వారికి ఆలయం నిర్మించాలి సంకల్పించి ఈ ఆలయం నిర్మించాడు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 05:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు #Chiryala Sri Laxmi Narsimha Swami Temple #Cheeryala #Keesara #Secunderabad #Hyderabad Temples #Hindu Temples guide 

Chaya Someshwara Temple | Nalgonda | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం తెలంగాణ లోని నల్గొండ జిల్లా కి కేవలం 4 కి.మీ దూరంలోనే ఉన్నది. ఈ ఆలయం గురించి తెలుసుకోవడం అంటే ఒక మిష్టరీ .  ఈ ఆలయం 10వ శతాబ్దం కి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని కందురు చోడుడు నిర్మించారు అని ఇక్కడ లభించిన శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఆలయం ఎదురుగా ఎటువంటి కట్టే కానీ ఏమి ఉండదూ కానీ శివాలయం మీద మాత్రం నీడ పడుతూ ఉంటుంది. ఇప్పటికి ఈ వింత మనం గమనించవచ్చు. పైన ఫోటోలో  చూడవచ్చు ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు  #Chaya Someshwara Temple #Nalgonda #Hyderabad Temples # Hindu Temples Guide 

Sri Sai Baba Temple | Gudimalkapur | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. బయటి నుంచి చూస్తే మీకు నూతనంగా కనిపిస్తుంది కానీ చాలా పురాతన ఆలయం. ఈ మధ్యే పునఃనిర్మాణం చేశారు. ఈ ఆలయం సుమారు రెండు ఎకరాలలో ఉంటుంది. కానీ కొని ఆక్రమణలకి గురి అయి కొంత స్థలం మాత్రమే మిగిలి ఉన్నది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి సాయి బాబాగా కొలువై ఉన్న ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సాయి బాబా తో పాటు గా శ్రీ త్రయంబకేశ్వరుడు , దుర్గా దేవి ఆలయం, దత్తాత్రేయ ఆలయం లు కూడా ఉన్నాయి. ఈ ఆలయం దసరా, దీపావళి, శివరాత్రి, దత్తాత్రేయ జయంతి, ఇతర పండుగ రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ లోని మెహింది పట్నం బస్ డిపో వద్ద కి చేరుకొని అక్కడి నుంచి ఆటోలో లేదా నడుచుకుంటూ కూడా ఈ ఆలయం చేరుకోవచ్చు. ఈ బస్ డిపో నుంచే కెవడం 1 కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుంచి 11:30  మధ్యాన్నం :  12;00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Sai Baba Temple #Gudimalkapur #Hyderabad Temples #Hindu Temples Guide

Sri Sai Baba Temple | Mehindipatnam | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం సుమారు 15 సం || కంటే ముందే ఈ ఆలయం కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సాయి బాబా తో పాటు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి.  ఈ ఆలయం రెండు అంతస్థులో ఉంటుంది. కింద దేవాలయం యొక్క హాల్ కలదు. మైన ప్రధాన దేవతల ఆలయాలు కాలవు. ఈ ఆలయం లో మొదట శ్రీ గణపతి ఆలయం తారువత లక్ష్మీ దేవి యొక్క ఆలయం , శివయ్య తండ్రి ఆలయం కలవు. గురు పూర్ణిమ రోజు , శివరాత్రి రోజు , దసరా పండుగ రోజు దీపావళి రోజు అధిక రద్దీ కలదు.  ఈ ఆలయంకి చేరుకోవాలి అంటే మొదట హైదరాబాద్ లో గల మెహిందిపట్నం వద్ద కి చేరుకొని 300 లేదా 92 నెంబర్ గల బస్ ఎక్కితే పిల్లర్ నంబర్ 54 వద్ద ఎదురుగా ఈ దేవాలయం కలదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Sai Baba Temple #Mehindipatnam #Hyderabad Temples  #Hindu Temples Guide 

Sri Pochamma Thalli Temple | Babulreddy Nagar | Kattedan | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. మొదట ఈ దేవాలయం చాలా చిన్నగా ఉంటుండే. కానీ అమ్మవారి దయతో ఆమెకి మొక్కిన మొక్కులు నిజాం కావడంతో ఇక్కడ భక్తుల రద్దీ రోజు రోజుకి అధికంగా అవుతుంది. ఈ ఆలయానికి కార్ పార్కింగ్ సౌకర్యం లేదు కానీ ఆలయం లోపల చాలా పెద్దగా ఉంటుంది.  ఈ ఆలయం లో దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సం || బోనాల పండుగ కూడా చాల బాగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఆరాం ఘర్ నుంచి మైలారదేవ్ పల్లి కి వెళ్ళే మార్గంలో సోలితాయిర్ స్కూల్ వెనుక ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00  నుంచి 08:00 వరకు  #Sri Pochamma Thalli Temple #Babulreddy Nagar #Kattedan #Hyderabad Temples #Hindu Temples Guide 

Sri Ramdev Baba Temple | Shivarampally | Hyderbad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం రాజస్థానీ మార్వాడీలకి చెందిన ఆలయం.  ఈ దేవాలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద మొదట గణపతి , అయ్యప్ప స్వామి , దుర్గా దేవి, శివయ్య స్వామితో పాటు ఇతర దేవతలు కలవు. మైన మాత్రం శ్రీ రామ్ దేవ్ బాబా గారి ఆలయం ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా రాజస్థాన్ లోని రామ్ దేవ్ బాబా గారి ఆలయాన్ని పోలి ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా స్థలం కలదు.  ఆరాం ఘర్ అనే ప్రాంతానికి మరియు శివరాం పల్లి ప్రాంతానికి ఈ ఆలయం మధ్యాలలో ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు  #Sri Ramdev Baba Temple #Shivarampally #Hyderbad Temples #Hindu Temples Guide 

Statue of Equality | Samatha Murthi | Shamshabad | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద గల ముచ్చింతల్ అనే గ్రామం లో కలదు. శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతి ని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా 216 అడుగుల శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు భారత ప్రధాన్ని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా 05 /02/2022 వ తేదీన ఆవిష్కరణ జరిగయిగినది.  2013వ సం || లో ప్రణాళికా జరిగి 2014 వ సం || పనులు ప్రారంభిస్తే దాదాపు 08 సం || తరువాత ఈ మూర్తి పూర్తి ఐనది.  ఈ ప్రాంతం మొత్తం 200 ఏకరాలలో నిర్మించబడినది. ఈ క్షేత్రంలో శ్రీ రామానుజాచార్య విగ్రహంతో పాటు శ్రీ వైష్ణవంలో భావించే 108 పుణ్య క్షేత్రాలు కలవు.  పేదలకు ఉచితంగా ప్రతి రోజు వైద్య పరీక్షలు , వైద్య సదుపాయాలు కూడా ఇక్కడ కలవు. అందుకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆసుపత్రి కలదు. ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రి లో ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నరు. ఇక్కడ వేద బ్రహ్మనులకి వేద పాఠశాల , లైబ్రరీ , ఆడిటోరియం , గ్యాలరీ , మినీ థియేటర్ కూడా కలవు. సాయంత్రం సమయంలో ఈ మూర్తిని చూడడం మరింత ఆకర్షణగా కనిపిస్తుంది.  దర్శన సమయం :  ఉదయం  : 06:3...

Sri Shiva Ganga Raja Rajeshwara swamy Temple | Maheshwaram | Rangareddy | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర. ఎక్కడ లేని విధంగా ఈ అలయని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని చాలా బాగా పునఃనిర్మాణం చేశారు.  ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అనగా ఏ ఆలయం లో ఐన ఆలయం పక్కనే లేదా ఎదురుగా ఆలయ కోనేరు ఉంటుంది. కానీ ఈ ఆలయం కోనేరు మీద ఆలయం ఉంటుంది. ప్రతి రోజు ఏ కాలంలో ఐన నీరు ఎండిపోకుండ ఉంటుంది. ఎప్పుడు నీరు ఉంటుంది.  ఈ ఆలయం మారియొక్క ప్రత్యేకత స్వామి మీద అమ్మ వారు కింద ఆలయం ఉంటుంది. ఇక్కడ మొదట గణపతి ఆలయం , హరి హర ఆలయం , ముఖ్టేశ్వర ఆలయం , ఇలా 15 ఇతర ఆలయాలు ఉన్నాయి.  వీటిని దర్శించుకొని చివరన కోనేరు మధ్యలో ఉన్న ప్రధాన ఆలయం ఐన శివ ఆలయం దర్శించుకొని ఆ తరువాత కోనేరు తగులుతూ ఉన్న శ్రీ రాజారాజేశ్వర తల్లి దర్శనం చేసుకోవాలి. హైదరాబాద్ ప్రధాన బస్ స్టాండ్ mgbs నుంచి మరియు ఐ స్ సధాన్ నుంచి ఈ ఆలయానికి డైరెక్ట్ బస్ లు కలవు.  శంషాబాద్ వద్ద గల తుక్కు గూడ నుంచి ఈ ఆలయానికి డైరెక్ట్ ఆటో లలో కూడా చేరుకోవచ్చు. ఆలయం ప్రయాణం ఏదో అడవిలో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది.  ఈ ఆలయం మారియొక్క శ్రీశైలం అని కూడా పిలుస్తారు.  ఆలయం దర్శన సమయం...

Edupayala Vana Durga Bhavani Temple | Medak Dist | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం దుర్గా దేవికి సంబందించిన ఆలయం. ఈ ఆలయం పేరులోనే ఉన్నది. ఎడుపాయాల అని అనగా ఈ ఆలయానికి నది నీరు ఏడు పాయలుగా వీడి ఈ ఆలయం ముందు ఒక నదిగా వెళుతుంది.  ఈ దేవాలయం హైదరబాద్ కి 140కి. మీ దూరంలోను మెదక్ జిల్లాకి 25కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం వద్ద నుంచి మెయిన్ రోడ్డు కి వచ్చే దారిలో ఒక పెద్ద కొలను వాటర్ ఫాల్ ఉన్నది. వర్ష కాలంలో చాలా బాగా ఉంటుంది.  ఈ ఆలయం నాగసాన్ పల్లి , పప్పన్నపేట మండలం మెదక్ జిల్లా లో కలదు. ఈ ఆలయం చేరుకోవాలి అంటే పూర్తిగా అడవి ప్రయాణం చేయాలి. ఈ దారిలో కోతిలు చాలా ఎక్కవగా ఉంటాయి. ఈ ఆలయం మంజీర నదివద్ద కలవు.   ప్రతి మంగళవారం , శుక్రవారం , ఆదివారం ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి మేకలను బలి ఇస్తారు. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రధాన ఆకర్షణ గుట్ట మీద 2 చిన్న గుడులు కలవు. ఒకటి అమ్మవారు , ఇంకోటి అయ్యా వారు. చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి గుహలో ఉంటాయి. మంచి అనుభూతి కలుగుతుంది.  ఇక్కడ అమ్మవారికి ప్రతి సం || జాతర చాలా బాగా జరుగుతుంది. ఆ జాతరని చూడడానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 ...

Ayyappa Swamy Temple | Vivekananda Nagar | Kukatpally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం కుకెట్ పల్లి వద్ద ఉన్నది. ఈ ఆలయం చాలా చిన్నగా కనిపించిన లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా కేరళ లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది.  ఈ దేవాలయం ప్రధాన దేవత మూర్తి శ్రీ అయ్యప్ప స్వామీ తో పాటు మనం ఇతర ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు.  శ్రీ గణపతి ఆలయం , సుబ్రమణ్య స్వామి ఆలయం , శ్రీ దుర్గదేవి ఆలయం , నవగ్రహ మండపం ,  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , సాయి బాబా ఆలయం లు కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం అని ఆలయలు లాగా కింద ఉండవు. ఈ ఆలయాలు దర్శించుకోవాలి అంటే మనం మొదటి అంతస్తు కి చేరుకోవాలి. డిసెంబర్ సమయం సాయంత్రం పుట ఈ ఆలయం దర్శించడం చాలా ఉత్తమం.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు   ఆలయ పూర్తి చిరునామా :  First floor shop 8, 4-32-1/270, Ramalayam Rd, Saptagiri Colony, Vivekananda Nagar, Kukatpally, Hyderabad, Telangana 500072 #Ayyappa swamy temple #Vivekananda Nagar #Kukatpally #Hyderabad temples #Hindu temples guide 

Sri Shyam Baba Temple | Kachiguda | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం కంచి కామకోటి పీఠం ఆధీనంలో ఉన్నది. ఈ దేవాలయం కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. హైదరబాద్ లో తప్పకుండా చూడవలసిన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణ ఆలయం.  శ్రీ కృష్ణ యొక్క మారియొక్క ప్రతిరూపమే ఈ శ్యామ్ బాబా. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయం మొదటి అంతస్తు లో ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి జరిగే హారతి చూస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది.  ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తో పాటుగా శ్రీ గణపతి ఆలయం , శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం, శివయ్య ఆలయం , దుర్గా దేవి ఆలయం , శ్రీ సీతరామ లక్ష్మణ ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ శ్రీ కృష్ణాష్టమి రోజు ,దసరా , దీపావళి రోజు రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ ప్రవేశానికి ఎటువంటి టిక్కెట్లు లేవు. మరియు ఆలయం ఎదురుగా గోశాల కూడా ఉన్నది. సాయంత్రం ఈ ఆలయం చూస్తే చాలా బాగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు  #Sri Shyam baba temple #Kachiguda #Hyderabad Temples #Hindu Temples Guide...

Sri Venkateshwara swami | Swarnagiri Temple | Bhuvanagiri | yadagiri gutta | Hindu temples guide

Image
  ఈ ఆలయం తెలంగాణలోనే అతి పెద్ద వేంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 47 కి. మీ దూరంలో మాత్రమే ఉన్నది. ఆలయం కి చేరుకోగానే మొదట స్వామి పాదాలు దర్శించుకోవచ్చు. తరువాత 108 మెట్లు ఎక్కితే స్వామి ఆలయం వస్తుంది.  ఈ ఆలయం పేరులోనే ఉన్నది స్వర్ణ గిరి అనగా స్వర్ణ అనగా బంగారం , గిరి అనగా కొండ. అంటే బంగారు కొండ. స్వామి ఎక్కడ ఉంటే శ్రీ మహాలక్ష్మీ అక్కడే ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీ ఇక్కడ ఉండడం వల్ల ఈ కొండని బంగారు కొండ అని పిలుస్తున్నారు.  ఈ ఆలయంలో మారియొక్క ప్రత్యేకత 40 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. స్వామి చూడగానే ఒక్క సారి ప్రతి ఒక్కరి మనసు అలా నిలబడి పోతుంది.  ప్రధాన ఆలయంలో స్వామి 12 అడుగుల ఎత్తు లో ఏక శిలా విగ్రహం ఉంటుంది. ఇక్కడ జల నారాయణ స్వామి విగ్రహం. చూడగానే అలా ఉండిపోవచ్చు.  రాత్రి వెళ్లలో ఈ ఆలయం దర్శించడం మారియొక్క అద్భుతం.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 08:30  #Sri Venkateshwara swami #Swarnagiri Temple #Bhuvanagiri #yadagiri gutta #Hindu temples guide...

Sri Sri Kosagundla phanigiri lakshmi narasimha swami devasthanam | Chiatanyapuri | Hyderabad | Hindu Temples Guide

Image
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 1700 సం || లో నిర్మించారు అని చరిత్ర. 1951 సం ||| లో ఈ అలయాన్ని పునఃనిర్మాణం చేశారు. మళ్ళీ 2005 లో ఈ అలయాన్ని పునఃనిర్మాణం చేశారు.ఇక్కడ స్వామి  వారు అంతరాలయం లో 5 ముఖ నాగదేవత తో కుడి ఉంటారు .  ఈ ఆలయం ఒక గుట్ట మీద స్వామి వెలిశారు. దేవలయంలోకి   వెళ్ళగానే మొదట ఒక చిన్న గోశాల కనిపిస్తుంది. వాటిని చూస్తే ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే  తారువాత గణపతి మండపం కనిపస్తునది,  స్వామి  వారు కళ్యాణ మండపం నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు గా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం కూడా ఉన్నది,  ఈ అలయని ఇప్పుడు శ్రీ యాదగిరీ గుట్ట   వాళ్ళు ఆధీనంలోకో తీసుకున్నారు పండుగ మరియు వైకుంఠ ఏకాదశి , ఆదివారం , నూతన సం || లో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04;30 నుంచి 08:00 వరకు  #Sri Sri Kosagundla phanigiri lakshmi narasimha swami devasthanam #Chiatanyapuri #Hyderabad temples #Hindu T...

Dakshin Ke Badrinath | Medchal | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం నూతనంగా నిర్మించారు. ఉత్తరభారతదేశంలో ఉన్నటు బద్రీనాథ్ ఆలయం నమూనా ఈ ఆలయం సరిగ్గా అలానే ఉంటుంది. ఆ ఆలయానికి  వెళ్ళాలి అంటే ఎంతో ఖర్చు మరియు శారీరకంగా సరిగ్గా ఉన్న వాతావరణం సహకరించక వెళ్లలేని వాళ్ళు చాలా మనదే ఉన్నారు. అలాంటి వల్ల కోసం ఈ ఆలయంని నిర్మించారు.  ఈ ఆలయం కి భారీ అంచనాలతో వెళ్ళితే నిరాశ పడవచ్చు. ఎటువంటి అంచనా లేకుండా వెళ్ళితే మనసుకు హాయిగా ఉంటుంది.  ఈ ఆలయం లో శ్రీ మహావిష్ణువు తో పాటు హోమగుండం ,శ్రీ లక్ష్మీ దేవి ,  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయలు కలవు.  ఈ ఆలయం నాంపల్లి కి 55 కి.మీ దూరంలో  సికింద్రాబాద్ నుంచి 40కి. మీ దూరంలోను మేడ్చల్ ప్రాంతానికి 10కి. మీ దూరంలోను ఉంటుంది. ఈ ఆలయం బయట చాలా ఖాళీ స్థలం ఉండడం వల్ల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 03:30 బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 07:45 వరకు  #Dakshin Ke Badrinath #Medchal #Hyderabad temples #Hindu Temples Guide 

Sri Venkateshwara Swamy Temple | Venkannagutta | Kattedan | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయన్ని పూర్తిగా ఒక గుట్ట మీద నిర్మించారు. ఈ దేవలయం సికింద్రాబాద్ నుంచి 25కి.మీ దూరంలోను మరియు ఆరాంఘర్ రోడ్డు నుంచి కేవలం 4కిమీ దూరంలో కలదు. ఇక్కడ మొదట ఒక కోనేరు ఉంటుంది. మరియు దాని పక్కనే ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి ని దర్శించుకొని ప్రధాన ఆలయంకి చేరుకోవాలి.  ఈ అలయంలోకి ప్రవేశించగానే స్వామి వాహనం శ్రీ గరుడ స్వామిని దర్శించుకోవాలి. ఈ ఆలయం పూర్తిగా గుట్ట మీద ఉండడం వల్ల ఆలయం నుంచి చూడగానే సిటీ వాతావరణం అంతా బాగా కనిపిస్తుంది. మరియు గాలి కూడా చాలా బాగా వస్తుంది.  ఈ ఆలయాన్ని 20 సం || క్రితమే ప్రారంభించారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ స్వామి వారు సాలిగ్రాంతో కుడి ఉంటారు. విష్ణవ సంప్రదాయం వారికి వీటి గురించి చాలా బాగా తెలుసు. ఇక్కడ స్వామి వారిని చూడగానే తిరుపతిలో శ్రీ వెంకన్న స్వామి చూసిన అనుభూతి కలుగుతుంది.  ఆలయం పక్కనే పెద్ద కళ్యాణ మండపం ఉన్నది. వెనుక కొన్ని మెట్లు కిందకి దిగగానే చిన్న గోశాల కనిపిస్తుంది. ఆలయం వెనుక స్వామి వారి శంఖ చక్ర వేంకటేశ్వర స్వామి తో పాటుగా స్వామీ పాదాలు కూడా దరించవచ్చు. వైకుంఠ ఏకాదశి , గోదాదేవి పండుగలలో రద్దీ చాలా అధికంగా ఉంటు...

Sri Kamakshi Ekambareshwara temple | Kothaguda | Kondapur | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 1972 లో 7 ఏకరాలతో మిస్టర్.న్యాపటి రామ రావు అనే వ్యక్తి గారు నిర్మించారు. ఈ ఆలయాన్ని పూర్తిగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉంటుంది.  ఈ ఆలయాన్ని పూర్వం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ వ్యక్తికి ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించామని చెప్పారు. వారు తమ స్వంత ఖర్చుతో నిర్మించారు.  ఈ ఆలయంలో శ్రీ రామ ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే స్వామి 14 సం || వనవాసం చేశారు. సరిగ్గా ఈ రామలయాన్ని నిర్మించడానికి కూడా సరిగ్గా 14 సం || సమయం పట్టినది.  ఈ దేవాలయంలో గణపతి ఆలయం . సుబ్రమణ్య స్వామి ఆలయం , ఏకాంబరేశ్వర ఆలయం , శ్రీ కామాక్షి అమ్మ ఆలయం ,  నవగ్రహ ఆలయం , శ్రీ కాలభైరవ స్వామి ఆలయం కలవు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Kamakshi Ekambareshwara temple #Kothaguda #Kondapur #Hyderabad Temples #Hindu Temples Guide 

Sri Kanakala Katta Maisamma Temple | Lower Tank Band | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని సుమారు 400 సం || క్రితమే నిర్మించారు అని చరిత్ర. అప్పుడు ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. కొద్ది సం || క్రితమే పునః నిర్మాణం చేసి చాలా బాగా అభివృద్ది  చేశారు. ఈ ఆలయం టాంక్ బాండ్ కింద అనగా లోవర్ టాంక్ బాండ్ అనే ప్రాంతం లో ఉంటుంది.  1996 సం || ఈ ఆలయం ఎండోమెంట్ అనగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఈ ఆలయంలో చండీ హోమం , దేవి నవరాత్రి , వసంత నవరాత్రి , దీపావళి , బోనాల పండుగ కుంభాభిషేకం , కుంకుమార్చన , మొదలగు పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆంగ్ల మన సం || మరియు తెలుగు ఉగాది రోజు , దసరా , బోనాలలో రద్దీ అధికంగా ఉంటుంది.  ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తారు. ఇక్కడ నూతన వాహనాల పూజలు కూడా చాలా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు మొదటి అంతస్థులో ఉంటారు. ఈ టాంక్ బాండ్ రోడ్డు కింద ఈ  ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు.  ఇందిరా పార్క్ కి వెళ్ళే దారిలో చౌరస్తా లో ఈ ఆలయం కలదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  #Sri Kanakala Katta M...

Sri Vijaya Ganapathi Devalayam | Sri Subrahmanya swamy temple | Sainikpuri | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం శ్రీ శృంగేరి పీఠం ఆధీనంలో కలదు. ఇక్కడ శ్రీ సుబ్రమణ్య స్వామి బయట 35 ఫీట్ ఆ ఎత్తులో కలదు. ఈ ఆలయం హైదరాబాద్ లోని సైనికపూరి వద్ద కలదు.  ఆలయంలో శ్రీ సుబ్రమణ్య స్వామి తో పాటుగా శ్రీ గణపతి ఆలయం , శివయ్య ఆలయం , దుర్గా దేవి , ఆలయాలు కలవు. వీటితో పాటుగా నవగ్రహ మండపం , హోమ గుండం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కలవు.  ఇక్కడ స్వామి వారికి పూజ జరిపించుకుంటే కుజ గ్రహం శాంతి పొందుతుంది అని భక్తుల విశ్వాసం. తమిళనాడు లో వలె స్వామి వారికి ఇక్కడ తొట్టెల సమర్పణ చేస్తారు.  ఈ ఆలయం సికింద్రాబాద్ నుంచి 12 కి.మీ దూరంలోను , ECILకి 06కి. మీ దూరంలో కలదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 06:30 బ్రేక్  సాయంత్రం : 06:30 నుంచి 08:15 వరకు  #Sri Vijaya Ganapathi Devalayam #Sri Subrahmanya swamy temple #Sainikpuri #Hyderabad temples #Hindu Temples Guide 

Sri Venkateswara Swami Temple | Jubilee Hills | TTD | Hyderabad | Hindu Temples guide

Image
  తిరుమలలో స్వామి వారిని కన్నులరా చూడాలి అని చాలా మంది భక్తులకి ఉంటుంది. కానీ అక్కడి భక్తుల దృష్టా స్వామివారిని సరిగ్గా చూడకుండానే వెనుతిరుగుతారు. అందులో కోసం మన టి టి డి వారు స్వామి వారిని సరిగ్గా తిరుపతిలో ఉండే విధంగా స్వామి వారి ఆలయాన్ని జూబ్లీ హీల్స్ లో నిర్మించారు. ఈ ఆలయం సరిగ్గా వనిత టివి ఆఫీసు ఎదురుగా ఒక కొండ మీద ఉంటుంది.  టి టి డి లో లాగానే ప్రతి రోజు స్వామి వారికి జరిగే కైకార్యాలు అని ఇక్కడ కూడా జరుగుతాయి. మొదట విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకున్న తరువాత శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. అన్నీ ఆలయాల ఖర్చు సుమారు 17 కోట్లు మీదనే జరిగినది. ఆలయం కొండ మీద ఉండడం వల్ల చక్కటి వాతావరణం , చక్కటి గాలి వస్తుంది. ఆలయంలో ప్రశాంతం వాతావరణం ఉంటుంది. ఆలయం వెనుక శ్రీ దేవి , భూదేవి ఆలయాలు కూడా ఉన్నాయి.  శుక్రవారం , శనివరం మరియు ఆదివారం రద్దీ అధికంగా ఉంటుంది. సుప్రభాత సేవతో మొదలు పెట్టి రాత్రికి ఏకాంత సేవతో ముగుస్తుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు ఒక రోజు ముందుగానే టికెట్ తీసుకొని సేవలో పాల్గొనే రోజు సంప్రదాయ దుస్తులలో వెళ్ళాలి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుం...

Kali mandir Aramaisamma Temple | Langer house | Hyderabad | Hindu temples guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. గత 2 సం || క్రితం ఆలయం పునః నిర్మాణం చేశారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ వద్ద కలదు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని కాళీ మందిర్ అని పిలుస్తున్నారు.  ఈ ఆలయం పూర్తిగా మిలిటరీ వల్ల ఆధీనంలో కలదు. ఇక్కడ పూజారులు కూడా వల్లే ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని చాలా బాగా నిర్మించారు. మరియు చాలా పెద్దగా ఉంటుంది.  మనకి ప్రధానంగా నాలుగు దిక్కులు ఉండగా దానికి ప్రాధికంగా నాలుగు ద్వారాలు కలవు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తి వంతమైన అమ్మవారు. ఇక్కడ భక్తితో అమ్మ శరీరురాలైన వింటున్నది అని నమ్మి ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేస్తుంది అని భక్తుల నమ్మకం. అందుకే వారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.  ఇక్కడ అమ్మవారు పూర్తిగా లలితా సహస్ర నామంలో చెప్పిన విధంగా అరుణారుణ వర్ణంతో అనగా అమ్మవారు పూర్తిగా కుంకుమతో కుడి ఉంటుంది. ఇక్కడ బోనాల పండుగ , దసరా పండుగ పెద్ద ఎత్తున చేస్తారు . చిలకురు బాలాజీ కి వెళ్ళే దారిలో ఉంటుంది. మెహింది పట్నం నుంచి 288 బస్ వెళుతుంది.  అమ్మవారి వెనుక శ్రీ ఆంజనేయ స్వామి , శివయ్య తండ్రి , కాళిక దేవి ఆలయాలు కలవు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి...

Puri Jaganath Temple | Banjara hills | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని బంజారా హీల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పూరీ లో ఆలయంలో పోలి ఉంటుంది.  ఈ దేవాలయాన్ని 2009లో నిర్మించారు. జగన్నాథ దేవాలయం రోజులో ఏ సమయంలోనైనా భూమిపై నీడ పడకుండా నిర్మించబడింది. ఆలయంలోకి వెళ్ళగానే ప్రశాంతంగా ఉంటుంది.   ఆలయం యొక్క 20 అడుగుల ఎత్తైన చక్రాన్ని నగరంలో ఎక్కడ నుండి చూసినా మొత్తం చక్రాన్ని చూడవచ్చు.మీరు నగరంలో ఎక్కడి నుండైనా చక్రం వైపు చూస్తే, అది మీకు ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 09:00 వరకు  #Puri Jaganath Temple #Banjara hills #Hyderabad Temples  #Hindu Temples Guide 

Saptha Mata Temple | Khairthabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద గల విజయమేరీ ఆసుపత్రి కి వెళ్ళి దారిలో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ దుర్గా దేవి.  ఈ ఆలయంలో ప్రతి సం || బోనల పండుగ మరియు దసరా , దీపావళి పండుగ చాలా బాగా నిర్వహిస్తారు. దసరా పండుగ రోజులో ప్రతి రోజు అన్నప్రసాదం వితరణ కూడ చేస్తారు.  ఈ అలయంలో ప్రధాన దేవత అమ్మవారు ఐనప్పటికి అమ్మవారితో పాటు ఇంకా 6 దేవత మూర్తిలు కలవు. అందుకే ఈ ఆలయానికి సప్తమాతా ఆలయం అనే పేరు వచ్చినది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి  08:30 వరకు  #Saptha Mata Temple #Khairthabad #Hyderabad temples #Hindu Temples Guide 

Sri Ayyappa Swamy Temple | Kattedan | Rajendhra nagar | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం 25 సం || పూర్వం నుంచే కలదు. ఈ ఆలయం తెలంగాణలోనే 2వ అతి పెద్ద అయ్యప్ప స్వామి ఆలయంగా పేరు పొందినది. ఈ ఆలయం నిర్మాణం చాలా కాలం పాటు సాగిన కూడా మొత్తం ఆలయం నిర్మాణం జరిగిన తరువాత మనం ఈ దేవలయంలోనే ఉన్నామా లేదా శబరిలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నమా అనే అనుభూతిని కలిగిస్తుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లో గల రాజేంద్రనగర్ మండలం , కట్టేదాన్ అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం పూర్తిగా ఒక కొండ మీద చాలా ఎత్తులో కలదు. అయ్యప్ప మాల ధరించే భక్తులు చాలా మంది ఈ ఆలయం ఈ కాలంలో దర్శించుకుంటారు.  ఈ దేవాలయంలో మనకి మొదట గణపతి , శివ పార్వతి దేవి ఆలయాలు కూడా కలవు. ఈ ఆలయం పోయినీర్ స్కూల్ కి కొద్ది దూరంలోనే ఉంటుంది. మీకు ఫోటోలో వెనుకన కనిపించే స్కూల్ అదే. అక్కడికి చేరుకొని నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు.  ఒక్కసారి ఈ ఆలయానికి చేరుకున్న తరువాత స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయ ప్రాంగణంలో కొద్ది సేపు అలా కూర్చన్నీ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత చక్కటి ఆలయం మాకు దగ్గరలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్...

Sri Sri Sri Sai baba temple | Shivarampally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని శివరాంపల్లి అనే గ్రామంలో కలదు. పూర్వం ఈ ఆలయానికి చాలా మంది భక్తులు వచ్చే వారు. కానీ ఇప్పుడు  తగ్గిపోయినది. దానికి కారణం ఆలయం ముందు పెద్ద వంతెన నిర్మించడమే కారణం. ఈ ఆలయం 2 అంతస్తులుగా నిర్మించారు.  కింద మొత్తం పూజ సమన్లు మరియు హాల్ కలదు. ఇక్కడ ప్రతి గురువారం రద్దీ అధికంగా ఉంటుంది. ప్రతి గురువారం రోజున మధ్యాన్నం అన్నప్రసాదం వితరణ జరుగుతుంది.  రెండవ అంతస్తులో శ్రీ శిరిడీ సాయి బాబా ని పోలిన విధంగా శ్రీ సాయి బాబా ఆలయం నిర్మించారు. ఈ ఆలయం నిర్మించి సుమారు 25 సం || పైనే చరిత్ర ఉన్నది. ప్రతి రోజు శిరిడీ లోని ఆలయం వలె కాకడ హారతి , శేజ్ హారతి , ఇతర హారతులు ఇస్తారు. గురు పౌర్ణమి రోజు , వ్యాస పూర్ణిమ రోజున రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00 వరకు  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి రాత్రి 07:30 వరకు  #Sri Sri Sri Sai baba temple #Shivarampally #Hyderabad  temples #Hindu Temples Guide