Sri Ayyappa Swamy Temple | Kattedan | Rajendhra nagar | Hindu Temples Guide

 


ఈ ఆలయం 25 సం || పూర్వం నుంచే కలదు. ఈ ఆలయం తెలంగాణలోనే 2వ అతి పెద్ద అయ్యప్ప స్వామి ఆలయంగా పేరు పొందినది. ఈ ఆలయం నిర్మాణం చాలా కాలం పాటు సాగిన కూడా మొత్తం ఆలయం నిర్మాణం జరిగిన తరువాత మనం ఈ దేవలయంలోనే ఉన్నామా లేదా శబరిలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నమా అనే అనుభూతిని కలిగిస్తుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లో గల రాజేంద్రనగర్ మండలం , కట్టేదాన్ అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం పూర్తిగా ఒక కొండ మీద చాలా ఎత్తులో కలదు. అయ్యప్ప మాల ధరించే భక్తులు చాలా మంది ఈ ఆలయం ఈ కాలంలో దర్శించుకుంటారు. 

ఈ దేవాలయంలో మనకి మొదట గణపతి , శివ పార్వతి దేవి ఆలయాలు కూడా కలవు. ఈ ఆలయం పోయినీర్ స్కూల్ కి కొద్ది దూరంలోనే ఉంటుంది. మీకు ఫోటోలో వెనుకన కనిపించే స్కూల్ అదే. అక్కడికి చేరుకొని నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

ఒక్కసారి ఈ ఆలయానికి చేరుకున్న తరువాత స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయ ప్రాంగణంలో కొద్ది సేపు అలా కూర్చన్నీ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత చక్కటి ఆలయం మాకు దగ్గరలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 09:00 వరకు 

అయ్యప్ప మాల ధరించిన భక్తుల కొరకు ఇప్పుడు సమయంలో మార్పులు ఉండవచ్చు. సాధారణ భక్తులు గమనించగలరని మనవి. ఈ ఆలయంలో హోమం కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో వివిధ భక్తులు స్వాములకి అన్నప్రసాదం కూడా చేస్తారు. 


#Sri Ayyappa Swamy Temple #Kattedan #Rajendhra nagar #Hyderabad temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana