Sri Shiva Ganga Raja Rajeshwara swamy Temple | Maheshwaram | Rangareddy | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర. ఎక్కడ లేని విధంగా ఈ అలయని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని చాలా బాగా పునఃనిర్మాణం చేశారు.
ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అనగా ఏ ఆలయం లో ఐన ఆలయం పక్కనే లేదా ఎదురుగా ఆలయ కోనేరు ఉంటుంది. కానీ ఈ ఆలయం కోనేరు మీద ఆలయం ఉంటుంది. ప్రతి రోజు ఏ కాలంలో ఐన నీరు ఎండిపోకుండ ఉంటుంది. ఎప్పుడు నీరు ఉంటుంది.
ఈ ఆలయం మారియొక్క ప్రత్యేకత స్వామి మీద అమ్మ వారు కింద ఆలయం ఉంటుంది. ఇక్కడ మొదట గణపతి ఆలయం , హరి హర ఆలయం , ముఖ్టేశ్వర ఆలయం , ఇలా 15 ఇతర ఆలయాలు ఉన్నాయి.
వీటిని దర్శించుకొని చివరన కోనేరు మధ్యలో ఉన్న ప్రధాన ఆలయం ఐన శివ ఆలయం దర్శించుకొని ఆ తరువాత కోనేరు తగులుతూ ఉన్న శ్రీ రాజారాజేశ్వర తల్లి దర్శనం చేసుకోవాలి. హైదరాబాద్ ప్రధాన బస్ స్టాండ్ mgbs నుంచి మరియు ఐ స్ సధాన్ నుంచి ఈ ఆలయానికి డైరెక్ట్ బస్ లు కలవు.
శంషాబాద్ వద్ద గల తుక్కు గూడ నుంచి ఈ ఆలయానికి డైరెక్ట్ ఆటో లలో కూడా చేరుకోవచ్చు. ఆలయం ప్రయాణం ఏదో అడవిలో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఈ ఆలయం మారియొక్క శ్రీశైలం అని కూడా పిలుస్తారు.
ఆలయం దర్శన సమయం
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు
ఆలయం చిరునామా :
Location : Maheshwaram, near shamshabad, Rangareddy.
#Sri Shiva Ganga Raja Rajeshwara swamy Temple #Maheshwaram #Rangareddy #hyderabad temples #Hindu Temples Guide

Comments
Post a Comment