Statue of Equality | Samatha Murthi | Shamshabad | Hyderabad | Hindu Temples Guide
ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద గల ముచ్చింతల్ అనే గ్రామం లో కలదు. శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతి ని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా 216 అడుగుల శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు భారత ప్రధాన్ని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా 05 /02/2022 వ తేదీన ఆవిష్కరణ జరిగయిగినది.
2013వ సం || లో ప్రణాళికా జరిగి 2014 వ సం || పనులు ప్రారంభిస్తే దాదాపు 08 సం || తరువాత ఈ మూర్తి పూర్తి ఐనది.
ఈ ప్రాంతం మొత్తం 200 ఏకరాలలో నిర్మించబడినది. ఈ క్షేత్రంలో శ్రీ రామానుజాచార్య విగ్రహంతో పాటు శ్రీ వైష్ణవంలో భావించే 108 పుణ్య క్షేత్రాలు కలవు.
పేదలకు ఉచితంగా ప్రతి రోజు వైద్య పరీక్షలు , వైద్య సదుపాయాలు కూడా ఇక్కడ కలవు. అందుకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆసుపత్రి కలదు. ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రి లో ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నరు. ఇక్కడ వేద బ్రహ్మనులకి వేద పాఠశాల , లైబ్రరీ , ఆడిటోరియం , గ్యాలరీ , మినీ థియేటర్ కూడా కలవు. సాయంత్రం సమయంలో ఈ మూర్తిని చూడడం మరింత ఆకర్షణగా కనిపిస్తుంది.
దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు
ప్రతి నెల చివరకి బుధవారం మూసి ఉంటుంది. పెద్దలకి టికెట్ 250/- పిల్లలకి 150/- కార్ పార్కింగ్ 40/-
#Samatha Murthi #Statue of Equality #Shamshabad #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment