Sri Venkateswara Swami Temple | Jubilee Hills | TTD | Hyderabad | Hindu Temples guide

 


తిరుమలలో స్వామి వారిని కన్నులరా చూడాలి అని చాలా మంది భక్తులకి ఉంటుంది. కానీ అక్కడి భక్తుల దృష్టా స్వామివారిని సరిగ్గా చూడకుండానే వెనుతిరుగుతారు. అందులో కోసం మన టి టి డి వారు స్వామి వారిని సరిగ్గా తిరుపతిలో ఉండే విధంగా స్వామి వారి ఆలయాన్ని జూబ్లీ హీల్స్ లో నిర్మించారు. ఈ ఆలయం సరిగ్గా వనిత టివి ఆఫీసు ఎదురుగా ఒక కొండ మీద ఉంటుంది. 

టి టి డి లో లాగానే ప్రతి రోజు స్వామి వారికి జరిగే కైకార్యాలు అని ఇక్కడ కూడా జరుగుతాయి. మొదట విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకున్న తరువాత శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. అన్నీ ఆలయాల ఖర్చు సుమారు 17 కోట్లు మీదనే జరిగినది. ఆలయం కొండ మీద ఉండడం వల్ల చక్కటి వాతావరణం , చక్కటి గాలి వస్తుంది. ఆలయంలో ప్రశాంతం వాతావరణం ఉంటుంది. ఆలయం వెనుక శ్రీ దేవి , భూదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. 

శుక్రవారం , శనివరం మరియు ఆదివారం రద్దీ అధికంగా ఉంటుంది. సుప్రభాత సేవతో మొదలు పెట్టి రాత్రికి ఏకాంత సేవతో ముగుస్తుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు ఒక రోజు ముందుగానే టికెట్ తీసుకొని సేవలో పాల్గొనే రోజు సంప్రదాయ దుస్తులలో వెళ్ళాలి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 05:00 నుంచి 11:30 

మధ్యాన్నం :12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు 

#Sri Venkateswara Swami Temple #Jubilee Hills #TTD #Hyderabad Temples #MiniTirumala #Hindu Temples guide

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana