Sri Sri Sri Sai baba temple | Shivarampally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని శివరాంపల్లి అనే గ్రామంలో కలదు. పూర్వం ఈ ఆలయానికి చాలా మంది భక్తులు వచ్చే వారు. కానీ ఇప్పుడు తగ్గిపోయినది. దానికి కారణం ఆలయం ముందు పెద్ద వంతెన నిర్మించడమే కారణం. ఈ ఆలయం 2 అంతస్తులుగా నిర్మించారు.
కింద మొత్తం పూజ సమన్లు మరియు హాల్ కలదు. ఇక్కడ ప్రతి గురువారం రద్దీ అధికంగా ఉంటుంది. ప్రతి గురువారం రోజున మధ్యాన్నం అన్నప్రసాదం వితరణ జరుగుతుంది.
రెండవ అంతస్తులో శ్రీ శిరిడీ సాయి బాబా ని పోలిన విధంగా శ్రీ సాయి బాబా ఆలయం నిర్మించారు. ఈ ఆలయం నిర్మించి సుమారు 25 సం || పైనే చరిత్ర ఉన్నది. ప్రతి రోజు శిరిడీ లోని ఆలయం వలె కాకడ హారతి , శేజ్ హారతి , ఇతర హారతులు ఇస్తారు. గురు పౌర్ణమి రోజు , వ్యాస పూర్ణిమ రోజున రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00 వరకు
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి రాత్రి 07:30 వరకు
#Sri Sri Sri Sai baba temple #Shivarampally #Hyderabad temples #Hindu Temples Guide

Comments
Post a Comment