Sri Kanakala Katta Maisamma Temple | Lower Tank Band | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని సుమారు 400 సం || క్రితమే నిర్మించారు అని చరిత్ర. అప్పుడు ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. కొద్ది సం || క్రితమే పునః నిర్మాణం చేసి చాలా బాగా అభివృద్ది చేశారు. ఈ ఆలయం టాంక్ బాండ్ కింద అనగా లోవర్ టాంక్ బాండ్ అనే ప్రాంతం లో ఉంటుంది.
1996 సం || ఈ ఆలయం ఎండోమెంట్ అనగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఈ ఆలయంలో చండీ హోమం , దేవి నవరాత్రి , వసంత నవరాత్రి , దీపావళి , బోనాల పండుగ కుంభాభిషేకం , కుంకుమార్చన , మొదలగు పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆంగ్ల మన సం || మరియు తెలుగు ఉగాది రోజు , దసరా , బోనాలలో రద్దీ అధికంగా ఉంటుంది.
ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తారు. ఇక్కడ నూతన వాహనాల పూజలు కూడా చాలా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు మొదటి అంతస్థులో ఉంటారు. ఈ టాంక్ బాండ్ రోడ్డు కింద ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఇందిరా పార్క్ కి వెళ్ళే దారిలో చౌరస్తా లో ఈ ఆలయం కలదు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Sri Kanakala Katta Maisamma Temple #Lower Tank Band #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment