Edupayala Vana Durga Bhavani Temple | Medak Dist | Hindu Temples Guide
ఈ ఆలయం దుర్గా దేవికి సంబందించిన ఆలయం. ఈ ఆలయం పేరులోనే ఉన్నది. ఎడుపాయాల అని అనగా ఈ ఆలయానికి నది నీరు ఏడు పాయలుగా వీడి ఈ ఆలయం ముందు ఒక నదిగా వెళుతుంది.
ఈ దేవాలయం హైదరబాద్ కి 140కి. మీ దూరంలోను మెదక్ జిల్లాకి 25కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం వద్ద నుంచి మెయిన్ రోడ్డు కి వచ్చే దారిలో ఒక పెద్ద కొలను వాటర్ ఫాల్ ఉన్నది. వర్ష కాలంలో చాలా బాగా ఉంటుంది.
ఈ ఆలయం నాగసాన్ పల్లి , పప్పన్నపేట మండలం మెదక్ జిల్లా లో కలదు. ఈ ఆలయం చేరుకోవాలి అంటే పూర్తిగా అడవి ప్రయాణం చేయాలి. ఈ దారిలో కోతిలు చాలా ఎక్కవగా ఉంటాయి. ఈ ఆలయం మంజీర నదివద్ద కలవు.
ప్రతి మంగళవారం , శుక్రవారం , ఆదివారం ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి మేకలను బలి ఇస్తారు. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రధాన ఆకర్షణ గుట్ట మీద 2 చిన్న గుడులు కలవు. ఒకటి అమ్మవారు , ఇంకోటి అయ్యా వారు. చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి గుహలో ఉంటాయి. మంచి అనుభూతి కలుగుతుంది.
ఇక్కడ అమ్మవారికి ప్రతి సం || జాతర చాలా బాగా జరుగుతుంది. ఆ జాతరని చూడడానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 02:30 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 07:00 వరకు
#Edupayala Vana Durga Bhavani Temple #Medak Dist #Hyderabad temples #Hindu Temples Guide

Comments
Post a Comment