Sri Laxmi Narasimha swamy temple | Moosapet | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 250 సం || కంటే పూర్వమే నుంచి ఉన్నది అని చరిత్ర. ఈ ఆలయాన్ని పూర్వం ఒక భక్తుడు స్వామి వారి కోసం తీవ్రమైన తప్పసు చేయగా స్వామి ఆ వ్యక్తికి కలలో నేను ఇక్కడే ఉన్నాను అని అనగా ఉదయమే వెళ్ళి చూడగా ఒక కొండలో మధ్యలో స్వామి వారిని చూస్తాడు.
ఈ ఆలయం అంచలు అంచలు గా అభివృద్ది చెందుతూ వచ్చింది. ఇక్కడ స్వామి వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించు కోవచ్చు. ఇక్కడ స్వామీ వారి వాహనం ఐన శ్రీ గరుత్మంతుడు స్వామి వారి ధ్వజ స్తంభం మీద దర్శించు కోవచ్చు. మరియు ఈ ఆలయంలో నవగ్రహ మండపం కూడా ఉన్నది.
ఆలయం దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 11:30 వరకు
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు
#Sri Laxmi Narasimha swamy temple #Moosapet #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment