Sri Venkateshwara swami | Swarnagiri Temple | Bhuvanagiri | yadagiri gutta | Hindu temples guide

 

ఈ ఆలయం తెలంగాణలోనే అతి పెద్ద వేంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 47 కి. మీ దూరంలో మాత్రమే ఉన్నది. ఆలయం కి చేరుకోగానే మొదట స్వామి పాదాలు దర్శించుకోవచ్చు. తరువాత 108 మెట్లు ఎక్కితే స్వామి ఆలయం వస్తుంది. 

ఈ ఆలయం పేరులోనే ఉన్నది స్వర్ణ గిరి అనగా స్వర్ణ అనగా బంగారం , గిరి అనగా కొండ. అంటే బంగారు కొండ. స్వామి ఎక్కడ ఉంటే శ్రీ మహాలక్ష్మీ అక్కడే ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీ ఇక్కడ ఉండడం వల్ల ఈ కొండని బంగారు కొండ అని పిలుస్తున్నారు. 

ఈ ఆలయంలో మారియొక్క ప్రత్యేకత 40 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. స్వామి చూడగానే ఒక్క సారి ప్రతి ఒక్కరి మనసు అలా నిలబడి పోతుంది. 

ప్రధాన ఆలయంలో స్వామి 12 అడుగుల ఎత్తు లో ఏక శిలా విగ్రహం ఉంటుంది. ఇక్కడ జల నారాయణ స్వామి విగ్రహం. చూడగానే అలా ఉండిపోవచ్చు.  రాత్రి వెళ్లలో ఈ ఆలయం దర్శించడం మారియొక్క అద్భుతం. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 08:30 

#Sri Venkateshwara swami #Swarnagiri Temple #Bhuvanagiri #yadagiri gutta #Hindu temples guide  

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana