Sri Venkateshwara Swamy Temple | Venkannagutta | Kattedan | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయన్ని పూర్తిగా ఒక గుట్ట మీద నిర్మించారు. ఈ దేవలయం సికింద్రాబాద్ నుంచి 25కి.మీ దూరంలోను మరియు ఆరాంఘర్ రోడ్డు నుంచి కేవలం 4కిమీ దూరంలో కలదు. ఇక్కడ మొదట ఒక కోనేరు ఉంటుంది. మరియు దాని పక్కనే ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి ని దర్శించుకొని ప్రధాన ఆలయంకి చేరుకోవాలి.
ఈ అలయంలోకి ప్రవేశించగానే స్వామి వాహనం శ్రీ గరుడ స్వామిని దర్శించుకోవాలి. ఈ ఆలయం పూర్తిగా గుట్ట మీద ఉండడం వల్ల ఆలయం నుంచి చూడగానే సిటీ వాతావరణం అంతా బాగా కనిపిస్తుంది. మరియు గాలి కూడా చాలా బాగా వస్తుంది.
ఈ ఆలయాన్ని 20 సం || క్రితమే ప్రారంభించారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ స్వామి వారు సాలిగ్రాంతో కుడి ఉంటారు. విష్ణవ సంప్రదాయం వారికి వీటి గురించి చాలా బాగా తెలుసు. ఇక్కడ స్వామి వారిని చూడగానే తిరుపతిలో శ్రీ వెంకన్న స్వామి చూసిన అనుభూతి కలుగుతుంది.
ఆలయం పక్కనే పెద్ద కళ్యాణ మండపం ఉన్నది. వెనుక కొన్ని మెట్లు కిందకి దిగగానే చిన్న గోశాల కనిపిస్తుంది. ఆలయం వెనుక స్వామి వారి శంఖ చక్ర వేంకటేశ్వర స్వామి తో పాటుగా స్వామీ పాదాలు కూడా దరించవచ్చు. వైకుంఠ ఏకాదశి , గోదాదేవి పండుగలలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా చేస్తారు. స్వామి వారి ఊరేరిగింపు కూడా చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30 వరకు
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు
#Sri Venkateshwara Swamy Temple #Venkannagutta #Kattedan #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment