Satya Datta Sadhanalaya | Yadarpalli | Keesara | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం పేరు శ్రీ సత్య దత్త సాధనాలయా. ఈ ఆలయం సికింద్రాబాద్ హైదరాబాద్ కి మధ్యలో గల కీసర మండలం , యాదర్పల్లి గ్రామంలో కలదు. ఈ ఆలయం ఫోటో 2019 లో ప్రారంబించిన అప్పటి ఫోటో. ఈ ఆలయం సరిగ్గా 5 సం || క్రితం అనగా సెప్టెంబర్ 3,4 తేదీ లలో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో కి అడుగు పెట్టగానే అస్సలు వస్తు ఉండడం తోనే ఏదో మనసుకి తెలియని ప్రశాంతత , అడవిలో కి వచ్చిన అనుభూతి కలుగుతుంది. వివాహం ఆలస్యం కావడం , ఉద్యోగం దొరుకాక పోవడం , ఏ పని జరగాలి అని ప్రారంభించిన ఆది లోనే ఆటంకాలు రావడం , గురు గ్రహం బలం తక్కువగా ఉన్న వారు దక్షిణ మూర్తి స్వామిని (లేదా) దత్తాత్రేయ స్వామి (లేదా) రాఘవేంద్ర స్వామి (లేదా) లలితా దేవిని పూజ చేయాలి. వీరు అందరూ గురు స్వరూపంతో ఉండే దేవత మూర్తులు. దత్తాత్రేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ భగవత్ గీత మరియు భాగవతం పారాయణ కూడా చేస్తారు.
ఇక్కడ అమ్మవారు , కృష్ణా , శ్రీ దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు. అన్నీ అలయాలో మాదిరిగా కాకుండా అస్సలు దత్తత్రేయ స్వామిని ఇక్కడ దర్శించవచ్చు. అనగ ఇక్కడ స్వామి తెల్లరాత్రి రూపంలో బ్రహ్మ , విష్ణు , మహేశ్వర రూపంతో ఏకశిలా రూపంతో దర్శించుకోవచ్చు. అని ఆలయలలో మనకి ఇలా దర్శనం కలిపించదు.
నిన్న అనగా 28/12/2024వ తేదీన కంచి కామకోటి 68వ పీఠాధిపతి , "నడిచే దేవుడు"గా పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి జన్మ నక్షత్రం రోజున అనగా అనురాధ నక్షత్రంరోజున ఇక్కడ అనురాధ ఉత్సవాన్ని మహాస్వామి సేవ సమితి వారు నిర్వహించడం జరిగినది. ఇక్కడ చిన్న యగశాల కూడా ఉన్నది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:00
ఎటువంటి ఎక్స్పెటేషన్స్ లేకుండా వెళితే మాత్రమే ఈ ప్రాంతాన్ని , అలయని చూసీ ఆనందించవచ్చు. గూగుల్ సెర్చ్ లో Satya Datta Sadhanalaya అని కొడితే వస్తుంది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం.

Comments
Post a Comment