Posts

Showing posts from October, 2025

Sri Raja Rajeshwari Temple | Amba guardern | Mehindipatnam | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ రాజ రాజేశ్వరి దేవి కొలువై ఉన్నారు. ఈ ఆలయం   ఈ దేవాలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం వద్ద గల అంబా గార్డెన్ కి కొద్ది దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ మినీ బస్ వంటి వాహనాలు ఈ ఆలయం వద్దకి తీసుకొని వెళ్లవచ్చు. కానీ భారీ బస్ లేదా ఇతర భారీ వాహనాలు తీసుకొని వెళ్లలేము అందుకు గల కారణం ఈ ఆలయం కొంచం లోపల గల కాలనీ లో ఉంటుంది.  ఈ దేవాలయం లో ప్రతి సం|| ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. మరియు ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి పండుగలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారా అలకరణ చేస్తారు. ఆ రోజులలో విశేష భక్త జన సంద్రోహంగా ఉంటుంది.  ప్రత్యేక రోజులలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, హోమలు కూడా నిర్వహిస్తారు.ప్రతి మంగళవారం , శుక్రవారం రోజులలో అమ్మవారికి నిమ్మకాయ దీపాలు , పిండి దీపాలు కూడా పెడుతారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:30 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Raja Rajeshwari Temple  #Amba guardern...

Sri Shivalayam | Karwan Rd | Markandeya Nagar | Gudimalkapur | Mehindipatnam

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. చాలా పురాతన ఆలయం కావడం వల్ల కొంచం కొంచం పునః నిర్మించుకున్నారు ఇక్కడి భక్తులు అందరూ.  ఈ ఆలయం హైదరాబాద్ లోని కార్వాన్ రోడ్ మార్కండేయ నగర్ గుడిమల్కాపూర్ వద్ద ఈ శివాలయన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ మాత్రమే ఉన్నది. త్రీ చక్ర , కార్ , భారీ వాహనాల పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం ఉన్నది.  ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నాయి. శివరాత్రీ రోజున విశేష అభిషేకాలు పూజలు జరుగుతాయి. శివరాత్రీ  మరుసటి రోజున అందరికీ ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Shivalayam  #Karwan Rd  #Markandeya Nagar  #Gudimalkapur  #Mehindipatnam 

Sri Kanaka Durga Devi Temple | Ayodhya Nagar Colony | Mehindipatnam | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ‌ ఆలయం కొంచం చిన్నగానే ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఇక్కడి భక్తులు శ్రీ కనక దుర్గా దేవి ఆలయంగా పిలుస్తారు. మరియు కొందరు శ్రీ దుర్గా దేవి మఠం అనే పేరు కూడా వాడుకలో ఉన్నది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందిపట్నం వద్ద గల PVNR బ్రిడ్జ్ 028వ పిల్లర్ కి ఎదురుగా శ్రీ అయోధ్య నగర్ కాలనీ బోర్డు ఉంటుంది. దానిలో నుంచి వెళితే ఈ గ్రామం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సరియైన కార్ పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం బైక్ పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం మెన్ రోడ్ మీదనే ఉంటుంది.  ఈ ఆలయం లో అని హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. గణపతి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు , దీపావళి , శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , శ్రీ ఆంజనేయ జయంతి అని పండుగలను జరుపుతారు. ప్రత్యేక రోజులలో ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Kanaka Durga Devi Temple  #Ayodhya Nagar Colony  #Mehindipatnam  #Hyderabad

Sri Rama Temple | Sharada Nagar | Opp Kakatiya vidhyanikethan School | Mehindipatnam | Hyderabad

Image
     ఈ ఆలయం చాలా ప్రసిద్దమైన ఆలయం మరియు ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం బయట నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించిన కూడా లోపల మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని శారద నగర్ వద్ద ఉన్న కాకతీయ విధ్యానికేతన్ స్కూల్ ఎదురుగా ఉంటుంది. ఇది మెహిందీపట్నం కి కేవలం 02 కి.మీ దూరం లో ఉంటుంది. ఈ ఆలయం కి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్విచక్ర వాహనం పార్కింగ్ మాత్రమే ఉంది. త్రీ చక్ర వాహనం , కార్ , బస్ ఇతర పెద్ద వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. కార్ లు స్కూల్ ఎదురుగా ఉన్న కాలనీ లో పార్కింగ్ చేసి నడుచుకుంటూ కూడా వెళ్లవచ్చు.  ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామీ ఆలయం , శ్రీ గణపతి స్వామి ఆలయం , శివాలయం ,  శ్రీ దుర్గా దేవి ఆలయం , నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. ప్రతి సం || మహా శివారాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు , హోమలు , భజనలు , తరువాత రోజున అందరికీ ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.  గణపతి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి. శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , కూడా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున విశేష పూజ...

Sri Balaji Venkateshwara Swamy Temple Mattam | Gudimalkapur | Hyderabad

Image
  ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. కార్ వంటివి కూడా వెల్లవు. రోడ్ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది. కానీ ఆలయం లోపల బాగా ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ వద్ద గల నెహ్రూ చిల్డ్రన్ స్కూల్ కి కొద్ది దూరం లోనే ఈ ఆలయం ఉంటుంది.  ఇక్కడి భక్తులు శ్రీ బాలాజి వేంకటేశ్వర స్వామి మఠం అని ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. కానీ ఇక్కడి భక్తులు పూర్తిగా పునః నిర్మించుకుకొని ప్రతి హిందూ పండుగను చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు.  ఈ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు , మహా శివారాత్రి ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు , స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 08:30 వరకు  #Sri Balaji Venkateshwara Swamy Temple Mattam  #Gudimalkapur  #Hyderabad 

Sri Seeta Ramanjaneya Swamy Temple | Happy Homes Colony | Venkateswara Hills | Janachaitanya colony | Upperpally | Telangana

Image
  ఈ ఆలయం చాలా చిన్న ఆలయం మరియు చాలా పాత ఆలయం. ఈ ఆలయం ఒక పార్క్ కి పక్కనే ఉండడం విశేషం.  ఈ దేవాలయం హైదరబాద్ లోని ఉప్పర్ పల్లి pvnr expressway 193 కి ఎదురుగా ఉన్న ఆల్ఫా హాస్పిటల్ కుడి వైపున కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మరియొక్క్ దారి కూడా ఉన్నది. డైరీ ఫారం x రోడ్ నుంచి హిప్పీ హోం కాలనీ కి మరియు , వేంకటేశ్వర హీల్స్ , జనచైతన్య కాలనీ కి మధ్యలో ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంగా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ దేవాలయం కొంచం ఇతర మతస్థులా ప్రాంతం అధీనంలో ఉండడం వల్ల రద్దీ చాలా తక్కువగానే ఉంటుంది.   ఈ ఆలయం లో శ్రీ సీతా రామచంద్ర స్వామి తో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , నవగ్రహ ఆలయం కూడా ఉన్నాయి. శ్రీ రామ నవమి , సీతా రాముల కళ్యాణం , హనుమాన్ హయంతి కూడా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు  #Sri Seeta Ramanjaneya Swamy Temple  #Happy Homes Colony  #Venkateswara Hills  #Janachaitanya colony...

Sri Ranganadha Swamy Temple | Jiyaguda | Hyderabad

Image
 ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని నిర్మించి సుమారు 350 సం|| కంటే ముందే నిర్మించారు అని చరిత్ర. ఈ దేవాలయం బయట చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ఒక్కటే సారి 100 ద్వి చక్ర వాహనాలు , 50 కార్లు కూడా నిలుపవచ్చు. ఆలయం బయట ఒక పెద్ద ధ్యాన మందిరం కూడా ఉన్నది.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని రంగనాధ నగర్ , ఇందిరా నగర్ ,  జియాగుడ వద్ద ఈ దేవాలయం ఉంటుంది. లోపల చిన్నగా ఉన్న బయట మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది.   ఈ దేవాలయం లో శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , హనుమాన్ జయంతి , వైకుంఠ ఏకాదశి చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. ఆ రోజులలో ఈ ఆలయాన్ని చాలా బాగా అలంకరణ చేస్తారు. తప్పకుండ సాయంత్రం సమయంలో ఈ ఆలయాన్ని దర్శిస్తే మనస్సుకు చాలా ఆనందం కలుగుతుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 వరకు  సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు  #Sri Ranganadha Swamy Temple  #Jiyaguda  #Hyderabad 

Karwan Darbar Maisamma Temple | Karwan | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 100 సం|| పైనే ఉంటుంది. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించి ఉంటుంది. పైన ఫోటో లో ఆలయన్ని కూడా చూడవచ్చు.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని కార్వాన్ కి కొద్ది దూరంలోను మరియు అత్తాపూర్ కి కేవలం 05కి.మీ దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది. హైదరాబాద్ లో తప్పకుండ చూడవలసిన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఇక్కడి అమ్మవారు చాలా శక్తివంతమైన గ్రామదేవత.  ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని కార్వాన్ దర్బార్ మైసమ్మగా పిలుస్తారు. ప్రతి సం|| ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి భక్తులు భారీ ఎత్తున బోనాలు సమర్పిస్తారు. అప్పుడు చాలా మంది భక్తులు వస్తారు.  ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా పండుగ తొమ్మిది రోజున పాటు అమ్మవారికి వివిధ రూపాల అలంకరణలు చేసి పదవ రోజు దసరా పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తప్పకుండ నేరవేర్చుతుంది అని భక్తుల విశ్వాసం. కానీ అవి కూడా ధర్మబద్దంగా ఉన్న కోరికలు మాత్రమే ఉండాలి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి...

Sri Sri Sri Pochamma Thalli Temple | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ 15సం|| కంటే ముందు నుంచే ఈ ఆలయం ఇక్కడ ఉండేది. అప్పుడు ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. కొద్ది నెలల క్రితమే పునః నిర్మాణం చేశారు. కేవలం ద్వి చక్ర వాహనం పార్కింగ్ సౌకర్యం కలదు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద కలదు. ఈ ఆలయంనికి చేరుకోవాలి అంటే మొదట మెహిందిపట్నం చేరుకొని అక్కడి నుంచి అత్తాపూర్ కి రావాలి. అక్కడి నుంచి ఈ ఆలయానికి ఆటొలో చేరుకోవచ్చు.  ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయముగా పిలుస్తారు. ఈ ఆలయం లో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారి తమ్ముడు పోతరాజుగా కొందరు భక్తులు పోతరాజు వేషం వేసి అమ్మవారికి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకరణలు చేసి హోమలు నిర్వహిస్తారు. అప్పుడు భక్తులు చాలా మంది వస్తారు. కుంకుమార్చనలు , లలితా సహస్రనామ పారాయణం , దేవి పురాణగాధలు వినడం జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00...

Prachin Hanuman Temple | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పేరులోనే మనకి అర్ధం అవుతుంది. ప్రాచీన హనుమాన్ దేవాలయం. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. మరియు  ఈ దేవాలయం కూడా కొంచం కిందికి ఉంటుంది.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి కేవలం 3కి.మీ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయానికి చేరుకోవడానికి మెహిందిపట్నం నుంచి అత్తాపూర్ బస్ స్టాండ్ వద్ద దిగి ఆటొలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి డైరెక్ట్ గా బస్ సౌకర్యం లేదు. ఆటొ వాళ్ళు ఈ ఆలయం పేరు చెపితే అక్కడే దిపేస్తారు.  S ఈ దేవాలయం మొత్తం కూడా రాతి తో నిర్మించారు. ఈ హనుమాన్ దేవాలయం సుమారు 250 సం|| కంటే ముందు నుంచే ఉన్నది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ దేవాలయం చూడడానికి బయటి నుంచి చాలా చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన దేవాలయం.  ఈ దేవాలయం బయట చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం ఉన్నది. ఒక్కటే సారి 10 కార్ ల వరకు ఇక్కడ నిలుపవచ్చు. ఈ దేవాలయం లో శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , హనుమాన్ జయంతి వేడుకలు చాలా వైభవంగా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : :06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు...

Sri Jaganath Muth | Sitarambagh | Asif Nagar | Hyderabad

Image
ఈ మఠం అత్యంత పురాతనమైన మఠం. ఇందులో శ్రీ జగనాథ్ స్వామి ఆలయం మరియు మఠం కూడా ఉన్నది. ఈ దేవాలయం ప్రసిద్దమైన దేవాలయం కూడా. ఈ దేవాలయానికి ప్రసిద్ద పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు కూడా దర్శించుకున్నారు.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని సీతారాంబాఘ్ వద్ద గల ఆసిఫ్ నగర్ కి చాలా దగ్గరను మరియు గుడ్ విల్ స్కూల్ కి పక్కనే అనుకొను ఉంటుంది ఈ దేవాలయం. చిన్న గోశాల కూడా ఉన్నది. ఒక్కటే సారి 100 మందికి పైగానే ఇక్కడ కూర్చొని భోజనం చేసే అంతా పెద్ద హాల్ కూడా ఉన్నది. ఇప్పుడు కొంచం పునః నిర్మాణం కూడా చేస్తున్నారు.  ఈ మఠం లో వృద్దుల కోసం ప్రత్యేకమైన గదులు , బయటి నుంచి వచ్చి ఇక్కడ కొన్ని దేవుని కొలుచుకొని వెళ్ళే వారి కోసం కూడా రూమ్ లు కలవు. వారి కోసం ఉదయం , మధ్యాన్నం , సాయంత్రం భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు.  ప్రతి సం || శ్రీ రామ నవమి , వైకుంఠ ఏకాదశి , శ్రీ జగన్నాథ్ స్వామి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక రోజులలో అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 01:00  మధ్యాన్నం : 01:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుం...

Dadawadi Jain Mandir | Karwan | Hyderabad

Image
  ఈ దేవాలయం హైదరాబాద్ లోని అని జైన్ ఆలయాల కంటే పురాతన జైన్ ఆలయం. ఈ దేవాలయం నిర్మించి ఇప్పటికీ 209 సంవత్సరాలు పైనే అవుతుంది. ఇంత గొప్ప చరిత్ర మరియు పురాతనమైన జైన్ దేవాలయం మన హైదరాబాద్ లో ఉండడం మన అందరికీ గర్వకారణం.   కార్వాన్ లోని ప్రాచీన జైన దేవాలయమైన దాదావాడి జైనామందిరంలో దేవత ప్రాణప్రతిష్ట మహోత్సవం చాలా వైభవంగా నిర్వహించారు. జైనుల మతానుసారం ప్రకారం 5 జైనప్రభువుల ప్రతిష్ట మహోత్సవలో 15 వేల మంది జైన భక్తులు పాల్గొనరు. ఈ కార్యక్రమం 72 గంటల పాటు ధ్యానం , శ్లోకపఠనం , భక్తి గీతాలు , భజనలు , భక్తులు నిర్వహించారు. జైనుల ఆచార్య అభయ సేమ్ జి మారసాబ్ జి మార్గదర్శకత్వంలో    పద్మవతి మాతా, నాద్ నిమినాథ్ , గోమియా మహారాజ్దా దాకుషన్ , గురుదేవ్, ప్రభు ఆదినాథ్, విగ్రహ ప్రతిష్ట జరిగినాయి.  ఈ ఆలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ కార్వాన్ వద్ద ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా 2 అంతస్తులలో ఉంటుంది. కింద బ్ల్యూ కలర్ డోర్ లు , తెల్ల రాతి తో నిర్మించారు.   ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్  సాయంత్రం : 03:00 నుంచి ...

vattepally Venkateshwara Swamy Temple | Falaknama | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ  దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ఆలయ నమూనా మరియు బయట ఉండే ప్రవేశ ద్వారం చూస్తేనే అర్ధం అవుతుంది.   ఈ దేవాలయం హైదరాబాద్ లోని హోల్లి జోసెఫ్ స్కూల్ ఎదురుగా ఉంటుంది. ఈ దేవాలయం స్వాగతం పలికే ఆర్చ్ యే చాలా పాతది. ఆలయ ప్రారంభంలోనే తెలిసిపోతుంది మనకి ఈ దేవాలయం చాలా పాతది అని. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దం లో నిర్మించారు అని ఇక్కడి శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు.  ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామి ఆలయం , శివాలయం , దుర్గా దేవి ఆలయం , ఆండాళ్ దేవి ఆలయం , లక్ష్మి దేవి ఆలయం , శ్రీ సీతారాముల స్వామి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , రావి చెట్టు , జమ్మి చెట్టు కూడా ఉన్నాయి.  ఈ ఆలయంలో ఉండే జమ్మి చెట్టు చుట్టూ పెళ్లి కానీ ఆడవారు లేదా మగవారు 41 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి తమ మొక్కు గురించి చెపితే తొందరలోనే ఆ కోరిక నెరవేర్తుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇలా 20 మంది భక్తుల వరకు కోరిక నెరవేరినది. కార్తీక మాసంలో చతుర్థి నాడు శివాలయంలో మరియు వేంకటేశ్వర స్వామి వార...

Divya Sakethanam | Munchintal Village | Shamshabad | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం నిర్మించి దాదాపుగా 05 సం || కంటే ముందు నుంచే ఉన్నది. పూర్వం ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉండేది. కాలక్రమేణ ఈ ఆలయానికి భక్తులు విరివిరిగా రావడం , స్వామి , అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని ముంచింతల్ గ్రామానికి మరియు పాలమకుల్ అనే గ్రామానికి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. శంషాబాద్ నుంచి ఈ ఆలయానికి కేవలం 05కి.మీ దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది.  ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర, త్రీ చక్ర, కార్, బస్, భారీ వాహనాలు కూడా ఇక్కడ నిలుపవచ్చు. చాలా పెద్ద పార్కింగ్ కలదు. ఒక్కసారి 100 కార్లు నిలుపవచ్చు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00  సాయంత్రం : 04:00 నుంచి 08:00  #Divya Sakethanam  #Munchintal Village  #Shamshabad  #Hyderabad 

Sri Peddamma Thalli Temple | Mamidipalli | Shamshabad | Hyderabad

Image
  ఈ దేవాలయాన్ని నూతనంగా పునః నిర్మించారు. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం . ఈ దేవాలయం మొదట చాలా చిన్నదిగా ఉండేది. కాలక్రమేణ భక్తులు పెరగడం , అమ్మవారికి ఇక్కడి గ్రామ ప్రజలు అందరూ కలిసి చిన్నగా ఉన్న ఆలయాన్ని పునః నిర్మించుకొని పెద్దిగా కట్టుకున్నారు. ఇక్కడి గ్రామ ప్రజలు ఈ అమ్మవారిని శ్రీ పెద్దమ్మ తల్లిగా కొలుస్తారు.  ఈ దేవాలయం హైదరబాద్ లోని మామిడి పల్లి అనే గ్రామానికి కేవలం 02కి.మీ దూరంలో శంషాబాద్ కి దగ్గరగా ఉంటుంది. విదేశీ పాస్పోర్ట్ సమాచారం ఆఫీసు కి ఎదురుగా ఉంటుంది. ఈ దేవాలయం చాలా చిన్నదిగా ఉన్న కూడా భక్తులు చాలా మందే  వస్తారు.  ఈ ఆలాయంలో ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ చివరి ఆదివారం రోజున ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం , శుక్రవారం , ఆదివారం కొంచం రద్దీగా ఉంటుంది. మిగిలిన సమయంలో అస్సలు రద్దీ యే ఉండధు.  ఈ దేవాలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల కేవలం ద్వి చక్ర వాహనాలకి మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉన్నది. త్రీ చక్ర , కార్ , బస్ , భారీ వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ మొత్తం ఎయిర్పోర్టు కి వెళ్ళే వాహనా...

Garigutta Peddamma Temple | Shatamrai Village | Shamshabad | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఇక్కడ అమ్మవారు ఒక పెద్ద గుట్ట కింద వెలిసి ఉంటారు. అందుకే ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని గరిగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయంగా పిలుస్తారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ శాతంరాయ్ అనే గ్రామానికి 02కి.మీ దూరంలోనే ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయం చాలా నిర్మానుష్య ప్రాంతంలో ఉండడం వల్ల మరియు గుట్ట మీద ఉండడం వల్ల ఈ ఆలయం సరియైన అభివృద్ది జరుగలేదు. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని వారి వారికి తోచిన విధంగా ఆర్ధిక సహాయం తో మెల్లి మెల్లిగా అభివృద్ది చేసుకుంటున్నారు.  ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ పెద్దమ్మ తల్లి. ఇక్కడి అమ్మవారికి నాన్ వెజ్ కూడా సమర్పిస్తారు. ప్రతి మంగళ వారం, శుక్రవారం , ఆదివారం రద్దీ కొంచం అధికంగానే ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00 మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్  సాయంత్రం : 03:00 నుంచి 07:00 వరకే  #Garigutta Peddamma Temple  #Shatamrai Village  #Shamshabad  #Hyderabad 

Shiva Temple | Shivarampally | Opp PVNR 280 | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా చిన్న ఆలయం మరియు ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఎదురుగా ఉన్న ఆ రవి చెట్టు ఎన్నో సం|| నుంచి ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. ఆలయం చాలా చిన్నదిగా ఉన్న కూడా చాలా మంది భక్తులు వస్తు ఉంటారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని ఆరంఘర్ మరియు శివరంపల్లి అనే రెండు గ్రామాలకి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం సరిగ్గా పి.వి. నరసింహ రావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 280 కి సరిగ్గా ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది. రాయల్ జ్యూస్ సెంటర్ కి ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివలింగం ఉన్నది. బయట గణపతి , హనుమాన్ , నందీశ్వరుడు కలరు. ఆలయం బయట రాతితో నిర్మించిన ధ్వజ స్తంభం కలదు. ఈ ఆలయానికి శివరాత్రి కి నెల రోజుల ముందు నుంచే అనగా మాఘ మాసం నుంచి మరియు డిసెంబర్ నెల లో అయ్యప్ప స్వామి భక్తులు కూడా చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ సమయం లలో ఈ ఆలయంలో ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు  #Shiva Temple #Shivarampally #Opp PVNR 280  #Rajendhra Nagar  #Hy...

Mata ka Mandir | Machaleshwar | Manchirevula | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 15 సం || కంటే ముందు నుంచే ఉన్నప్పటికి పాత ఆలయం కొంచం చిన్నదిగా ఉండేధి. ఇప్పుడు అందరూ కలిసి కొంచం పెద్దిగా నిర్మించుకున్నారు.  ఈ ఆలయంలో దేవి నవరాత్రి లో నవ దుర్గలు గా ఏవిధంగా ఐతే పూజిస్తామో అదే విధంగా ఇక్కడ నవ దుర్గాదేవతలను పూజిస్తారు. ప్రతి మంగళ వారం రోజున మరియు శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన , అభిషేకం , ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. దేవి నవరాత్రి రోజులలో మాత్రమే కాకుండా ఆషాఢ మాసంలో బోనాల పండుగ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు.  ఈ ఆలయం హైదరబాద్ లోని మంచిరేవుల వద్ద గల మాచలేశ్వర్ వద్ద మాత కా మందిర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం కి చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్, బస్, భారీ వాహనాలు కూడా ఇక్కడ నిలుపవచ్చు.  ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల చాలా మందికి తెలియదు. ప్రభుత్వ బస్, ఆటొ వంటి వాహనాలు కూడా వెల్లవు అందుకే అభివృద్ది కి సరిగ్గా నోచుకోలేదు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:00  #Mata ka Mandir...

Laxmi Ganapati Temple | Laxmivani Apartment | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం నూతనంగా నిర్మించారు. ఈ ఆలయం అపార్ట్మెంట్ మధ్యాలో ఉండడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడి భక్తులు ఈ ఆలయాన్ని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. చూస్తే తప్పకుండ ఆచార్య పోతారు. అందరూ కలిసి అపార్ట్మెంట్ మధ్యలో ఆలయాన్ని నిర్మించుకున్నారు అని చాలా ఆనందపడుతారు.  ఈ దేవాలయాన్ని హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద ఏనుగుల మైసమ్మ అమ్మావారి ఆలయాన్నికి ఎదురుగా శ్రీ లక్ష్మివాణి అపార్ట్మెంట్ వద్ద ఈ దేవాలయం ఉంటుంది. గూగుల్ లొకేషన్ లో కూడా ఈ ఆలయం ఉన్నది. అక్కడ వత్చ్మెన్ అడిగితే అతనే చూపిస్తాడు.  ఈ ఆలయంలో ప్రతి సం || గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ 09 రోజుల పాటు గణపతి మట్టి విగ్రహానికి మరియు ఆలయ విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం లో మరియొక్క ప్రత్యేకత ఏమిటి అనగా చుట్టూ పక్కల గల అపార్ట్మెంట్ లో ఉండే వారు అందరూ కలిసి కట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. గణపతి ఉత్సవాలు సమాయలో అందరూ కలిసి ఒక్కో పనిని పంచుకుంటారు. ఈ ఆలయం లోపల చిన్న హోమ గుండం కూడా ఉన్నది. 09 రోజుల పాటు ఇక్కడ హోమలు చేస్తూనే ఉంటారు.  10 వ రోజు అందరూ కలి...

Abhayanjaneya Swamy Temple | Janapriya Utopia | Attapur | Upperpally | Hyderabad

Image
  ఈ ఆలయం కేవలం 05 సం|| క్రితమే నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాన దేవత మూర్తి శ్రీ అభయంజనేయ స్వామి. ఈ ఆలయం ముందు రాతి తో నిర్మించిన ధ్వజ స్తంభం దర్శించవచ్చు. ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం అపార్ట్మెంట్ లోపల ఉండడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.  ఈ దేవాలయాన్ని హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల జనప్రియ ఉతోపియా అనే అపార్ట్మెంట్ లో ఈ ఆలయాన్ని దర్శించూకోవచ్చు. ఉప్పర్ పల్లి అనే గ్రామానికి ఈ ఆలయం చాలా దగ్గరగానే ఉంటుంది. ఈ ఆలయం నుంచి కేవలం 01 కి.మీ దూరంలోనే ఎర్రబోడ లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం కూడా దర్శించవచ్చు.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సీతారాముల కళ్యాణం , శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి , వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజున భక్తులందరికి అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ దేవాలయంలో శ్రీ గణపతి ఆలయం , శివాలయం కూడా ఉన్నాయి. ప్రతి సోమవారం రోజున స్వామి ఆలయం లో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:30 మధ్యాన్నం : 12:30 నుంచి 05:00 బ్రేక్ సాయంత్రం : 05:00 నుంచి 08:00    #Abhayanjaneya Swamy Temple  #Janapriya U...

Shiva Anjaneya Swamy Devasthanam | Shivarampally Jagir | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతి తో నిర్మించారు. అందుకోసమే చాలా పాత గుడి ఐన ఇంకా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉన్నది.  ఈ దేవాలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ మండలం శివరాంపల్లి అనే జాగీర్ లో ఈ దేవాలయం కలదు.  ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి కాగా ఈ ఆలయం లో మరియొక్క ప్రధాన దేవత మూర్తి కూడా ఉన్నాడు. ఈ ఆలయంలో 2 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామి ఆలయం మరియు శివాలయం. ప్రతి సం || శివరాత్రి రోజున మరియు శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి రోజులలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజులలో ఆన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు. సోమవారం , శనివారం కొంచం రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడి అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.   ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  #Shiva Anjaneya Swamy Devasthanam #Shivarampally Jagir #Rajendhra Nagar #Hyderabad 

Sri Nalla Pochamma Temple | Aramghar | RajendhraNagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 30 సంవత్సరాలు క్రితమే నిర్మించారు అని తెలుస్తుంది. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. భక్తులు అందరూ కలిసికట్టుగా ఈ ఆలయాన్ని అభివృద్ది చేసుకున్నారు. ఈ ఆలయంలో కేవలం 25 మంది పట్టే అంతా స్థలంలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయం హైదరబాద్ లోని ఆరంఘర్ వద్ద పిల్లర్ నెంబర్ 311 కి ఎదురుగా ఈ దేవాలయం ఉన్నది. తెలంగాణ లోని ఈ గ్రామ దేవత కి నోన్ వెజ్ కూడా బలి ఇచ్చే సంప్రదాయం ఇక్కడ ఉన్నది.  ఈ ఆలయం ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దసరా పండుగ 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఈ ఆలయంచూడడానికి చాలా చిన్నగా ఉన్న కూడా భక్తులు మాత్రం చాలా మందే వస్తారు. ఈ ఆలయానికి సరియైన ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ ,బస్ వంటి వాటికి ఏ విధమైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు గల ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రోడ్ కి ఒక్క పక్కన ఉంటుంది.  దసరా పండుగ రోజున ఇతర ముఖ్యమైన పండుగ రోజులలో రద్దీ కొంచం అధికంగా ఉంటుంది. కొంత మంది ఈ ఆలయంలో అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. ఆరంఘర్ బస్ స్టాప్ నుంచి ఈ ఆలయం కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంట...

Ramulawari Temple | Alluri Sitaramaraju Nagar | Gudimalkapur | Mehidipatnam | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని సుమారు 50 సంవత్సరాల కంటే ముందు ఉన్నది. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు రాములవారి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా చిన్నగా ఉన్న కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.   ఈ దేవాలయం హైదరబాద్ లోని మెహిందిపట్నం కి అతి చేరువలో ఉన్న గుడిమల్కాపూర్ అనే గ్రామంలో సరిగ్గా రైతు బజార్ కి వెనుక 02కి.మీ  దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ రాములవారి ఆలయంతో పాటుగా ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ గణపతి ఆలయం , శ్రీ కృష్ణా స్వామి ఆలయం, శ్రీ దుర్గా దేవి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి.  ఈ ఆలయానికి సరియైన త్రీ చక్ర , కార్, బస్ వంటి వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. ఈ ఆలయం ప్రధాన రహదారికి కొంచం దూరంలో మరియు చిన్న గల్లీ లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా రోడ్ ఉండడం వల్ల ఈ ఆలయం ముందు నుంచే వాహనాలు వెళ్ళడం వల్ల ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.  ఈ దేవాలయంలో ప్రతి సం || శ్రీ రామ నవమి రోజూన కళ్యాణం , శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున విశేష పూజలు నిర్వహించి అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహ...

Sri Mallanna Swamy Temple | Shatamrai | Shamshabad | Hyderabad

Image
 ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు కట్టించారో కూడా సరియైన సమాచారం లేదు. కానీ ఆలయం నమూనా మరియు ఆలయ ప్రకరాలు చూస్తే ఈ ఆలయం సుమారు 50 సంవ్సరాల కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించారు అని తెలుస్తుంది.  ఈ ఆలయం హైదరబాద్ లోని శంషాబాద్ వద్ద గల శాతం రాయ్ అని గ్రామానికి 05కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉన్నది. శాతంరాయ్ అనే గ్రామం నుంచి కొంచం ముందుకు వెళ్లానే శంషాబాద్ కి వెళ్ళే బ్రిడ్జ్ ఎక్కకుండ ఎడమ వైపుకు వెళ్ళాలి. ఇతర మతస్థుల ప్రార్ధన స్థలం నుంచే ఇంకా ఎడమ వైపుకు వెళ్ళితే ఆ రోడ్ మార్గం గుండా గూగుల్ మాప్ ప్రకారం వెళ్ళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.  ఈ ఆలయంలో మనకి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ గుడిలో నైనా మల్లన స్వామి అంటే విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం శివ లింగ రూపంలో దర్శనం ఇస్తారు. మీరు కొమరవెళ్ళి లోని మల్లన్న స్వామి ని దర్శించుకుంటే తేడా అర్ధం అవుతుంది.  ఈ ఆలయం ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ గణపతి స్వామి ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం , హోమగుండం , గోశాల , శ్రీ హనుమాన్ ఆలయం కూడా ఉన్నాయి.  ప్రతి మాస శివరా...

Sri Bhavani Bangaru Soudamma Temple | Manasa Hills | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ చివరన జంట నగరాలకి జలశ్రయం ఐన హిమాయత్ సాగర్ అనే డ్యామ్ కి అతి చేరువలోనే మానస హీల్స్ అనే ప్రాంతం వద్ద ఈ దేవాలయం ఉన్నది.  ఈ ఆలయం లో అమ్మవారిని శ్రీ భవాని బంగారు సౌడమ్మ ఆలయంగా పిల్సుస్తారు. తెలంగాణ లోని అమ్మవారికి మరియు ఈ అమ్మవారికి కూడా కళ్ళు , మందు , నాన్ వెజ్ నైవేద్యంగా స్భక్తులు సమర్పిస్తారు.  ఈ అమ్మవారు గ్రామ దేవతగా మరియు ఊరు అంతటికీ పెద్దమ్మగా పిలుస్తారు. కొందరు భక్తులు నెలకి ఒక్కసారి మరి కొందరు 03నెలలకి ఒక్కసారి, కొందరు భక్తులు 6 నెలలకి ఒక్కసారి తప్పకుండ దర్శించుకుంటారు. ఇక్కడి భక్తులు కొందరు ఈ అమ్మవారిని వారి ఇంటి ఇలా వేల్పుగా కూడా పిలుచుకుంటారు.  ఈ ఆలయం హిమాయత్ సాగర్ డ్యామ్ కి అతి దగ్గరలో ఉండడం వల్ల నీటికి ఎటువంటి కొరత ఉండధు.  ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం , శుక్రవారం , ఆదివారం , దసరా సమయంలో చాలా విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. సిటి కి చాలా దూరంగా ఉండడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి సారిగ్గా తెలియదు. ఈ ఆలయం వద్ద చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర, త్రీ చక్ర, కార్...