Ramulawari Temple | Alluri Sitaramaraju Nagar | Gudimalkapur | Mehidipatnam | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని సుమారు 50 సంవత్సరాల కంటే ముందు ఉన్నది. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు రాములవారి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా చిన్నగా ఉన్న కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఈ దేవాలయం హైదరబాద్ లోని మెహిందిపట్నం కి అతి చేరువలో ఉన్న గుడిమల్కాపూర్ అనే గ్రామంలో సరిగ్గా రైతు బజార్ కి వెనుక 02కి.మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ రాములవారి ఆలయంతో పాటుగా ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ గణపతి ఆలయం , శ్రీ కృష్ణా స్వామి ఆలయం, శ్రీ దుర్గా దేవి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి.
ఈ ఆలయానికి సరియైన త్రీ చక్ర , కార్, బస్ వంటి వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. ఈ ఆలయం ప్రధాన రహదారికి కొంచం దూరంలో మరియు చిన్న గల్లీ లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా రోడ్ ఉండడం వల్ల ఈ ఆలయం ముందు నుంచే వాహనాలు వెళ్ళడం వల్ల ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.
ఈ దేవాలయంలో ప్రతి సం || శ్రీ రామ నవమి రోజూన కళ్యాణం , శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున విశేష పూజలు నిర్వహించి అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు మాత్రమే.
#Ramulawari Temple #Alluri Sitaramaraju Nagar #Gudimalkapur #Mehidipatnam #Hyderabad

Comments
Post a Comment