Karwan Darbar Maisamma Temple | Karwan | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 100 సం|| పైనే ఉంటుంది. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించి ఉంటుంది. పైన ఫోటో లో ఆలయన్ని కూడా చూడవచ్చు.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని కార్వాన్ కి కొద్ది దూరంలోను మరియు అత్తాపూర్ కి కేవలం 05కి.మీ దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది. హైదరాబాద్ లో తప్పకుండ చూడవలసిన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఇక్కడి అమ్మవారు చాలా శక్తివంతమైన గ్రామదేవత.
ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని కార్వాన్ దర్బార్ మైసమ్మగా పిలుస్తారు. ప్రతి సం|| ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి భక్తులు భారీ ఎత్తున బోనాలు సమర్పిస్తారు. అప్పుడు చాలా మంది భక్తులు వస్తారు.
ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా పండుగ తొమ్మిది రోజున పాటు అమ్మవారికి వివిధ రూపాల అలంకరణలు చేసి పదవ రోజు దసరా పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తప్పకుండ నేరవేర్చుతుంది అని భక్తుల విశ్వాసం. కానీ అవి కూడా ధర్మబద్దంగా ఉన్న కోరికలు మాత్రమే ఉండాలి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు
#karwan Darbar Maisamma temple #Karwan #Attapur #Hyderabad

Comments
Post a Comment