Abhayanjaneya Swamy Temple | Janapriya Utopia | Attapur | Upperpally | Hyderabad
ఈ ఆలయం కేవలం 05 సం|| క్రితమే నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాన దేవత మూర్తి శ్రీ అభయంజనేయ స్వామి. ఈ ఆలయం ముందు రాతి తో నిర్మించిన ధ్వజ స్తంభం దర్శించవచ్చు. ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం అపార్ట్మెంట్ లోపల ఉండడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.
ఈ దేవాలయాన్ని హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల జనప్రియ ఉతోపియా అనే అపార్ట్మెంట్ లో ఈ ఆలయాన్ని దర్శించూకోవచ్చు. ఉప్పర్ పల్లి అనే గ్రామానికి ఈ ఆలయం చాలా దగ్గరగానే ఉంటుంది. ఈ ఆలయం నుంచి కేవలం 01 కి.మీ దూరంలోనే ఎర్రబోడ లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం కూడా దర్శించవచ్చు.
ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సీతారాముల కళ్యాణం , శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి , వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజున భక్తులందరికి అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ దేవాలయంలో శ్రీ గణపతి ఆలయం , శివాలయం కూడా ఉన్నాయి. ప్రతి సోమవారం రోజున స్వామి ఆలయం లో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Abhayanjaneya Swamy Temple #Janapriya Utopia #Attapur #Upperpally #Hyderabad

Comments
Post a Comment