Laxmi Ganapati Temple | Laxmivani Apartment | Attapur | Hyderabad
ఈ ఆలయం నూతనంగా నిర్మించారు. ఈ ఆలయం అపార్ట్మెంట్ మధ్యాలో ఉండడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడి భక్తులు ఈ ఆలయాన్ని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. చూస్తే తప్పకుండ ఆచార్య పోతారు. అందరూ కలిసి అపార్ట్మెంట్ మధ్యలో ఆలయాన్ని నిర్మించుకున్నారు అని చాలా ఆనందపడుతారు.
ఈ దేవాలయాన్ని హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద ఏనుగుల మైసమ్మ అమ్మావారి ఆలయాన్నికి ఎదురుగా శ్రీ లక్ష్మివాణి అపార్ట్మెంట్ వద్ద ఈ దేవాలయం ఉంటుంది. గూగుల్ లొకేషన్ లో కూడా ఈ ఆలయం ఉన్నది. అక్కడ వత్చ్మెన్ అడిగితే అతనే చూపిస్తాడు.
ఈ ఆలయంలో ప్రతి సం || గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ 09 రోజుల పాటు గణపతి మట్టి విగ్రహానికి మరియు ఆలయ విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం లో మరియొక్క ప్రత్యేకత ఏమిటి అనగా చుట్టూ పక్కల గల అపార్ట్మెంట్ లో ఉండే వారు అందరూ కలిసి కట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. గణపతి ఉత్సవాలు సమాయలో అందరూ కలిసి ఒక్కో పనిని పంచుకుంటారు. ఈ ఆలయం లోపల చిన్న హోమ గుండం కూడా ఉన్నది. 09 రోజుల పాటు ఇక్కడ హోమలు చేస్తూనే ఉంటారు.
10 వ రోజు అందరూ కలిసి సాయంత్రం సమయంలో మట్టి గణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చుతారు. ఒక కొడుకుని తల్లి వద్ద దింపినట్టుగా చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఆడ వారు , మగ వారు , చిన్న పెద్ద పిల్లలు , అందరూ డప్పు వాయిద్యాలు మొగిస్తూ , చిందులు వేస్తూ చాలా ఆనందంగా జరుపుకుంటారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:00
మధ్యాన్నం : 11 :00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Laxmi Ganapati Temple #Laxmivani Apartment #Attapur #Hyderabad

Comments
Post a Comment